సభా సంప్రదాయం : ఉత్తమ్ పై హరీశ్ గుస్సా

SABAఫీజు రీయింబర్స్  మెంట్ పై మంత్రి చెప్పిన సమాధానం సరిగా లేదంటూ వాకౌట్ చేశాయి ప్రతిపక్ష పార్టీలు. బుధవారం (నవంబర్-15)న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై జరిగిన చర్చలో..పీసీసీ చీఫ్ ఉత్తమ్, మంత్రి హరీష్ రావు మాటమాట నడిచింది. లీడర్, డిప్యూటీ లీడర్ మాత్రమే ప్రొటెస్ట్ చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. అయితే సభ్యులు ఎవరైనా ప్రొటెస్ట్ తెలుపొచ్చన్న ఉత్తమ్.. మంత్రి హరీష్ సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో ఉన్న సంప్రదాయాన్ని పాటించకపోవడం సరికాదన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ సభ్యులకు సభా సంప్రదాయాల మీదా గౌరవం లేదా.. లేక నాయకుడు, ఉపనాయకుడిపై విశ్వాసం లేదా.. లేక కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఉన్నాయా అన్నది వాళ్లిష్టమన్నారు హరీష్‌రావు. సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ.. తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. శాసనసభా వ్యవహారాల మంత్రికి అవగాహన లేదనడం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నానన్న హరీష్‌రావు.. మంత్రిగా పని చేసినటువంటి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ రకంగా మాట్లాడటం సరికాదన్నారు.

మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు, ఈపీసీ టెండర్లకు, సర్వే డిజైన్ల పేర్ల మీద పనులు చేయకుండా కోట్ల రూపాయాలు కొల్లగొట్టి.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ నేతలకు కమిషన్ల గురించి మాట్లాడే హక్కుందా..అని ప్రశ్నించారు మంత్రి. CBI కేసులు ఎదుర్కొని.. జైళ్లల్లో పడ్డటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సభ్యులు అని తెలిపారు. వీరు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈపీసీ విధానాన్ని రద్దు చేశాం. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను, సర్వే డిజైన్లను రద్దు చేశాం.. అత్యంత పారదర్శకంగా పనులను చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని  స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy