సభ తీరుపై గవర్నర్ కు సీఎం రిపోర్ట్

CM-Governorఅసెంబ్లీ సెషన్… విపక్షాల తీరు…. జల విధానం. ఇలా అన్నింటిపై గవర్నర్ తో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి. రాజ్ భవన్ లో నరసింహన్ ను కలిసిన కేసీఆర్… వివిధ అంశాలపై చర్చించారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రావాలని గవర్నర్ ను ఇన్వైట్ చేశారు సీఎం. అటు నరసింహన్ తో సీఎం భేటీ … టీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది.

రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం రెండు గంటల పాటు జరిగిన మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ నిరవధిక వాయిదా తర్వాత నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ సెషన్ జరిగిన తీరుతో పాటు సభలో విపక్షాల తీరుపై సీఎం గవర్నర్ కు వివరించినట్టు సమాచారం. ఈ మధ్యే గవర్నర్ ను మీటయిన ముఖ్యమంత్రి ఉభయ సభలను సమావేశపరిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు. దీనికి గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం. ఐతే విపక్షాల సస్పెన్షన్ తో అది వాయిదా పడింది. మరోవైపు ఈ నెల 15 లేదంటే 16 న ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి జల విధానంపై ప్రభుత్వ విధానంపై క్లారిటీ ఇస్తామని గవర్నర్ కు వివరించినట్టు సమాచారం. ఈ సమావేశానికి కూడా గవర్నర్ ను ఇన్వైట్ చేసినట్టు తెలస్తోంది. అటు గవర్నర్ ఢిల్లీ టూర్ అప్డేట్స్ తో పాటు రాష్ట్రంలో కరువు మండలాల లిస్టును కేంద్రానికి పంపే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

గవర్నర్,  సీఎంల భేటీ ఎప్పుడూ జరిగేదే అయినా ఈ మీటింగ్ పై అధికార పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని రోజులగా కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో సీఎం రాజ్ భవన్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ఢిల్లీ టూర్ తర్వాత సీఎం కలవడంతో ఈ భేటీకి ఇంపార్టెన్స్ పెరిగింది. అయితే మంత్రి హరీష్ రావు కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని క్లారిటి ఇచ్చారు. అయినా ఈ టైమ్ లో సీఎం గవర్నర్ తో భేటీ అవ్వడం అధికార పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సెషన్ ముగియడం, త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ పై సీఎంకు వివరించారు ముఖ్యమంత్రి. గవర్నర్ ను సీఎం కలవడం మర్యాద పూర్వకమే అయినా…. కేబినెట్ విస్తరణపై  మాత్రం ఏదో  జరుగుతుందోనన్న ఇంట్రస్ట్ అధికార పార్టీ నేతల్లో కనబడుతోంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy