‘సమన్యాయం’ తప్ప మాదీ అదే లైన్: వెంకయ్య ‘బాబు’ నాయుడు

vn1

babu

 

కొద్ది రోజులుగా T బిల్లు విషయంలో భాజపా అవలంబిస్తున్న వైఖరి గందరగోళంగా మారింది. మొదటి సారి ఈ జాతీయ పార్టీలో తెలంగాణా అంశం పై చీలిక కనిపిస్తుంది. అన్ని ప్రధాన పత్రికలూ, చానళ్ళలో సీమాంధ్ర BJP, తెలంగాణా BJP అనే వర్ణన కనిపించింది. వెంకయ్య నాయుడు తెలంగాణా అంశం గురించి మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గరినుంచీ అయోమయం మొదలైనా అదిప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు.

నిన్న నెల్లూరులో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ బిల్లు పూర్తీ స్వరూపం తెలిస్తేనే మద్దతు గురించి తేలుస్తాం అన్నారు. లోప భూయిష్టమైన బిల్లు, సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడుతున్నట్లు స్పష్టమయితేనే మద్దతు, మా తలపై తుపాకీ ఉంచి బెదిరిస్తే ఒప్పుకోం అంటూ పలు వ్యాఖ్యలు చేసారు. BJP ప్రతిపాదించిన సవరణలు అంటూ వెంకయ్య చెప్పిన లిస్టులో తెలంగాణా మేలును కూడా దృష్టిలో పెట్టుకున్న అంశాలు కేవలం ఒకటో, రెండో మాత్రమే. హైదరాబాద్ ఆదాయాన్ని పంచాలనే డిమాండ్, ఉత్తరాంధ్రకు, సీమకు ప్యాకేజీలు, మూడు కొత్త విమానాశ్రయాలు, సీమంధ్రలో 150కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలనే డిమాండ్… ఇలా వెంకయ్య నాయుడు కూడా తెలుగు వారి ప్రయోజనాలంటే సీమాంధ్ర ప్రయోజనాలు, సమ న్యాయం అంటే సీమాంధ్రకు ఎక్కువ న్యాయం, అవసరమైతే తెలంగాణాకు వీలైనంత అన్యాయం అనే వైఖరే ప్రదర్శించారు.

వెంకయ్య ‘బాబు’ నాయుడి ఈ అవతారంతో తెలంగాణా BJP అనే పేరిట ఇప్పటికైతే రాష్ట్రంలో BJPకి ఉన్న ఎన్నికైన నాయకులైన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎండల లక్ష్మీ నారాయణ, రాష్ట పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా బయటికి వచ్చి వెంకయ్య సీమాంధ్ర ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నాడని గట్టిగా అసంతృప్తి తెలిపారు.

కొద్ది రోజులుగా TDP, BJP పొత్తు దాదాపు ఖరారైందని, వెంకయ్యనాయుడు ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషించారని ఈ మధ్య వార్తలు బలంగా వినిపించాయి. అలాంటి వార్తలు మొదలైన తర్వాతే తెలంగాణా పై BJP పాత్ర విషయంలో అనుమానాలు కూడా మొదలయ్యాయి.

‘సమ న్యాయం’ అనే పదం మేము వాడడం లేదని ప్రెస్ మీట్ లో వెంకయ్య నాయుడు అనడం ఒక ఐరానిక్ ముగింపు!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy