సమయం లేదు : కర్ణాటకలో మొదలైన బేరసారాలు

yeddyకర్ణాటకలో బల పరీక్ష సమయం దగ్గరపడుతున్నా కొద్దీ..పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురి ఎమ్మెల్యేల బేరసారాలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారు. ఈ క్రమంలో  కాంగ్రెస్ పార్టీనేతతో .. సీఎం యడ్యూరప్పకు సంబంధించిన మరో ఆడియో టేపును విడుదల చేసింది. కాంగ్రెస్ నాయకుడు బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప సంభాషణ ఇలా కొనసాగింది.

ఇద్దరి మధ్యన సంభాషణ ఇలా ఉంది..

యడ్యూరప్ప : పాటిల్ ఎక్కడున్నారు?
బీసీ పాటిల్ : మేము బస్సులో కొచ్చి వెళ్తున్నాం
యడ్యూరప్ప : కొచ్చి వెళ్లకు.. ఇక్కడికి వచ్చేయ్, మంత్రి పదవి ఇస్తాం.. మాట్లాడుదాం.. వెనక్కి వచ్చేయ్.
పాటిల్ : మొదటే నాకు చెప్పి ఉంటే బాగుండేది.. ఇప్పుడు బస్సులో ఉన్నాం.
యడ్యూరప్ప : ఏదో కారణం చెప్పి వెనక్కి వచ్చేయ్. ఇంట్లో వాళ్లకు సమస్య ఉందని చెప్పి వెనక్కి వచ్చేయ్.
పాటిల్ : ఇక ముందు నా పొజిషన్ ఏంటీ?
యడ్యూరప్ప : నువ్వు మంత్రి అవుతావు.
పాటిల్ : నాతో పాటు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు.
యడ్యూరప్ప : నీ వెంట ఉన్న వాళ్లను పిలుచుకొని రా.. నాపై విశ్వాసం ఉంది కదా? ఒక్కసారి నువ్వు కొచ్చి వెళ్తే ఇక దొరకవు.. అది జరగని విషయం. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు.
పాటిల్ : ఐదు నిమిషాల్లో మీకు ఫోన్ చేసి చెబుతా.
యడ్యూరప్ప : శ్రీరాములకు ఫోన్ చేసి చెప్పు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy