సమస్యల్లో 108

108ఆపదలో ఉన్నవారికి 108 ఆపన్నహస్తం. 108 కి ఫోన్ కొడితే.. నిమిషాల్లో అంబులెన్స్ పేషంట్ ముందుంటుంది. ఇప్పుడు ఈ సర్వీసు సమస్యల్లో ఉంది. రోజుల తరబడి సర్వర్స్ మొరాయిస్తున్నా… యాజమాన్యం పట్టించుకుంటలేదన్న విమర్శలున్నాయి. సర్కారే డబ్బులు కడుతున్నా.. సరిగా సర్వీస్ అందించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ పేషంట్లను టైంకు దవాఖానకు చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏర్పాటైంది జీవికే ఈఎమ్ఆర్ఐ సంస్థ. పదకొండేళ్ల నుంచి 108 సేవలందిస్తోంది. ఈ మధ్య ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతుందన్నఆరోపణలు  తరుచూ వినిపిస్తున్నాయి.

రెండు రాష్ట్రాలకు ఒకటే సర్వర్ ఉండటంతో చాలాసార్లు  ఫోన్ కాల్స్ కు అంతరాయం కలుగుతుంది.  టైంకు వేహికల్ రాక  పేషంట్లు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ కు కొనిచ్చిన 337 వాహనాల్లో కనీసం రోజు 319 రన్నింగ్ లో ఉండాలనే రూల్ ఉన్నా, పలు కారణాలతో ఎక్కువ వాహనాలను షెడ్డుకే పరిమితం చేస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల కొరత కూడా  ప్రభావం చూపుతుంది.

మొదట్లో  ప్రభుత్వం నిర్వాహణకు అయ్యే ఖర్చులో 75 శాతం నిధులే ఇచ్చేది. ఆ తర్వాత జీవీకే డిమాండ్ తో ఖర్చులు మెత్తం సర్కారే భరిస్తుంది.  అయినా జీవికే సరిగ్గా సర్వీసలను అందించడం లేదంటున్నారు.  ప్రస్తుతమున్న టెక్నికల్ ప్రాబ్లమ్  గాలిదుమారంతో వచ్చిందని చెప్తున్నారు అధికారులు. నిన్నకూడా మరోసారి సర్వర్ ప్రాబ్లమ్ వచ్చిందన్నారు. ఉద్యోగుల జీతాలు కొంతవరకు పెంచామనీ..తీసేసిన ఉద్యోగులను తీసుకొవాలని జీవికే సంస్థకు సూచించామన్నారు. ప్రతిఒక్కరు ఉపయోగించే 108 అంబులెన్స్ లను పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనావుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy