సమస్యల సుడిగుండంలో కేయూ వర్శిటీ

Kakatiya_Universityకాకతీయ యూనివర్సిటీని విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. పేరుకే పెద్ద యూనివర్సిటీ అయినా…క్యాంపస్ లో కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. హాస్టల్ సమస్యలతో పాటు అధ్యాపకుల కొరత కూడా సమస్యగా ఉందంటున్నారు విద్యార్థులు.

ఎంతో కష్టపడి క్యాంపస్ లో సీటు సంపాదించిన విద్యార్థులను అక్కడి సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఎన్నిసార్లు, అధికారులు, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినా… పరిస్థితిలో మార్పు రావడం లేదంటున్నారు స్టూడెంట్స్.

పారిశుద్ద్య నిర్వాహణ సరిగా లేకపోవడంతో హాస్టల్ రూమ్స్ కంపుకొడుతున్నాయంటున్నారు స్టూడెంట్స్. బెడ్స్ విరిగిపోయి పడుకోవడానికి ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు. ఇక ఏటా పెరుగుతున్న విద్యార్థులకు తగ్గట్టుగా కిత్త బిల్డింగులు నిర్మించకపోవడంతో ఉన్న రూంలలోనే అందరిని అడ్జెస్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఒక్కో రూంలో 10 మంది వరకు ఉండాల్సిన పరిస్థితి.  ఇక ఫ్యాన్లు, విద్యుత్ లైట్స్ కూడా సరిగా పనిచేయడం లేదంటున్నారు విద్యార్థులు .

ఒకప్పుడు కేయూలో సీటు రావడమే గొప్పగా భావించే విద్యార్థులు…ఇప్పుడు ఈ పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ లో సరైన మెస్ లేక…కాలేజీలో క్లాస్ లు చెప్పేందుకు ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతో మానసికంగా కుంగిపోతున్నామంటున్నారు స్టూడెంట్స్.  కేయూలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు యూనివర్సిటీ అధ్యాపకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy