సమానత్వం, సామాజిక న్యాయమే లక్ష్యం : కేసీఆర్

kcr-speech-golkondaస్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోఅహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. సాధారణంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు త్వరగా కుదురుకోలేదు. దాన్ని తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఈ ఫలితం వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపైనే ప్రభుత్వం సాగుతోంది. సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరందించే లక్ష్యంగా మిషన్‌ భగీరథ చేపట్టాం. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘షీ’ బృందాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. నిరుపేద ఆడపిల్లలకు వివాహం చేసేందుకు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేసుకునే వారికి మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డ అయితే రూ.13వేలు చెల్లిస్తున్నాం. రాష్ట్రం ఆవిర్భవించాక కరెంటు కష్టాలు తీరిపోయాయి. ప్రస్తుతం ఇంటి వినియోగంతో పాటు వ్యవసాయానికి 24 గంటలూ కరెంట్‌ సరఫరా చేయగలుగుతున్నాము. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే తెలంగాణ విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించనుంది. పేకాట, సారా మహామ్మారని తరిమికొట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.  డ్రగ్స్ ను ఆదిలోనే అంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. పలె సీమలో దేశానికి పట్టు కొమ్మలుగా గ్రామ స్వరాజ్వం బాగుండాలి. రైతు అప్పుకోసం చేయిచాచే రోజు రాకూడదు. సమగ్ర భూ సర్వేతో తెలంగాణ చరిత్ర లిఖించనుంది. రైతులకు కొత్త్ పట్టాపాస్ బుక్కులు వస్తాయి. రైతు పండించిన పంటకు డిమాండ్ కోసం పాటుపడుతాం. అవకాశాన్ని సరైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులలో మానవ వనరులు గుర్తించడంలో  సరికొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే 47 లక్షల గొర్రెలకు యాదవులకు పంపిణీ చేశాం. చేపల పెంపకానికి మత్య్సకారుల కోసం పథకాలను తీసుకొచ్చం. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మకు 93 లక్షల మహిళలు చీరలను కానుకగా ఇవ్వనున్నాం. రజకులకు బట్టలు ఉతికేందుకు అదునాతన యంత్రాలను ఇస్తాం. కమ్మరి శిల్పకారులకు, సబ్బండ కుల వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ప్రపంచాన్నే ఆకట్టుకున్న తెలంగాణ మనందరికీ ఆనందకరం అన్నారు’  సీఎం కేసీఆర్‌.

నిరుద్యోగ యువతకు శుభవార్త..
పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిరుద్యోగ యువతకు సీఎం శుభవార్త అందిస్తున్నట్లు చెప్పారు. ‘తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమంలో చెప్పా. ప్రభుత్వం లక్షా 12 వేల 536 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పటివరకు 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టాం. త్వరలో మరో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతాం. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు’ సీఎం వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ నియామకంలో లక్షా 12 వేల 536 పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌.

ఉద్యాగాల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య : లక్షా 12 వేల 536

ఇప్పటికే ఉద్యోగాల భర్తీ : 27 వేల 660

నియామక దశ : 36వేల806 ఉద్యోగాలు

భర్తీకి సిద్ధంగా మరో 48 వేల 70 పోస్టులు

పోలీస్ శాఖలో 37 వేల 820 ఉద్యోగాలు

విద్యుత్ శాఖలో 12 వేల 961 ఉద్యోగాలు

ఉపాధ్యాయ పోస్టులు 12 వేల 005

వైద్య ఆరోగ్య విభాగంలో 8 వేల 347

సింగరేణి గనుల్లో నియామకాలు 7 వేల 485

ఆర్టీసీలో 3 వేల 950 ఉద్యోగాలు

పాత రెసిడెన్షియల్ స్కూళ్లలో 8 వేల 511 పోస్టులు

కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం 3 వేల 925 పోస్టులు

పంచాయతీ రాజ్ శాఖలో 3 వేల 528 పోస్టులు

రెవెన్యూ విభాగంలో 2 వేల 506 పోస్టులు

అగ్రి, హార్టీ కల్చర్ విభాగంలో 2 వేల 435 పోస్టులు

అటవీ శాఖలో 2 వేల 33 ఉద్యోగాలు

ఉన్నత విద్యా శాఖలో 1678 పోస్టులు

ఇరిగేషన్ విభాగంలో 1058 పోస్టులు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy