సముద్రంపై నిఘాకు అమెరికా డ్రోన్లు

An U.S Air Force MQ-9 Reaper drone is prepared for the upcoming ILA Berlin Air Show in Schoenefeldభారత రక్షణశాఖకు గార్డియన్ డ్రోన్లు ఇచ్చేందుకు అంగీకరించింది అమెరికా. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఓ నిర్ణయానికి వచ్చారు ఇరు దేశాధినేతలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు రక్షణ, భద్రత అంశాల్లో సహకారంపై జరిపిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది.  ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు 22 ప్రిడేటర్‌ గార్డియన్‌ డ్రోన్లను అమ్మనున్నట్లు తెలిపింది వైట్‌హౌస్‌. ట్రంప్‌తో తొలిసారిగా భేటీ అయిన మోడీ డ్రోన్ల ఒప్పందం గురించి చర్చించారు. భారత దేశానికున్న సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంపై నిఘా ఉంచేందుకు కేంద్రం ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత గల ఈ డ్రోన్లు 50వేల అడుగుల ఎత్తులో 27గంటలపాటు ప్రయాణించగలవు. ఈ డ్రోన్లను అమెరికా భారత్‌కు విక్రయించే డీల్‌పై చైనా ఆందోళన చెందుతున్నప్పటికీ బేఖాతరు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy