సముద్రంలో వేట : కల్వరి సబ్ మెరైన్ వచ్చేసింది

modiభారత నౌకాదళంలో INS కల్వరి జలాంతర్గామి చేరింది. గురువారం (డిసెంబర్-14) ముంబయిలో కల్వరిని నౌకాదళానికి అప్పగిస్తూ ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. జల్గాంతర్గామి లోపలికి వెళ్లి పరిశీలించారు మోడీ. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ సహకారంతో INS కల్వరి నిర్మాణం జరిగిందని చెప్పారు ప్రధాని. భారత్-ఫ్రాన్స్ ల మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదో ఉదాహరణగా చెప్పారు. సముద్రం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను సమర్థంగా నిలువరించేందుకు భారత్ కీరోల్ పోషిస్తుందన్నారు ప్రధాని. మరోవైపు జమ్మూకశ్మీర్లో పరిస్థితులను వివరించారు మోడీ. ఈ ఏడాది 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో వేర్పాటు వాదుల ఆందోళనలు కూడా తగ్గాయన్నారు ప్రధాని.

INS కల్వరిని ప్రత్యేకతలు
సముద్రపు లోతుల్లో అత్యంత రహస్యంగా సంచరించగల స్టెల్త్‌ సామర్థ్యం దీని సొంతం. టార్పెడోలతో, ట్యూబ్‌ల ద్వారా యాంటీ షిప్‌ క్షిపణులతో సముద్ర అంతర్భాగం నుంచి.. ఉపరితలం నుంచి కూడా దాడులు చేయగల సత్తా ఈ జలాంతర్గామికి ఉంది. యాంటీ-సర్ఫేస్‌ వార్‌ఫేర్‌, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లలో పాల్గొనే సత్తా.. రహస్య సమాచార సేకరణ, నిఘా, బాంబులు అమర్చే సామర్థ్యం.. ఇలా అత్యాధునిక సబ్‌మెరైన్లకు ఉండాల్సిన అన్ని సామర్థ్యాలూ దీనికి ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy