సమ్మక్కకు పూజలు : మేడారం జాతరకు అంకురార్పణ

medaramమేడారం దండకారణ్యం.. వనదేవతల జాతరతో జనారన్యంగా మారుతోంది. మహానగరాన్ని తలపించేలా విద్యుత్ దీప కాంతుల్లో వెలిగిపోతోంది. మేడారం పరిసర ప్రాంతాలంలోని అమ్మవార్లకు అంకురార్పణ చేశారు. వడి బియ్యాలు పోసి, ప్రత్యేక పూజలు చేశారు సమ్మక్క పూజారులు. ఈ నెల 31 నుంచి జరిగే జాతర సందర్భంగా ముందుగా పలు ఆలయాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలోనే మేడారంలో మండెమెలిగే పండుగను నిర్వహిస్తున్నారు సమ్మక్క పూజారులు. గట్టమ్మ దేవాలయం ములుగు, కన్నెపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజులూ, పూనుగొండ్లలో పగిడిద్ద రాజు అలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy