సమ్మక్క – సారక్క జాతర ఏర్పాట్లపై కసరత్తు

Medaram Jatara, Samakka-Sarakka Jataraఈ నెల 3వ తేదీలోగా సర్కారుకు ప్రతిపాదనలు

వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క-సారక్క  జాతరకు సమాయత్తమవుతోంది సర్కార్. జాతర ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు సీఎస్ రాజీవ్ శర్మ. వరంగల్ జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ నెల మూడో తేదీలోగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 182 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం… ప్రస్తుతం 100 కోట్ల ప్రతిపాదనలకు అనుమతినిచ్చింది.

Telangana_1_Reg_HY_1750296fవచ్చే ఏడాది ఫిబ్రవరి 17న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 18 న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు తీసుకొస్తారు. 19న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 20న అమ్మవారు వనప్రవేశం చేస్తారు. దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు వనదేవతలను మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే అవకాశముంది. దీంతో పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జాతరపై విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి. జాతరను కనీవినిఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జాతర జరుగుతుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

sammakka-sarakka-jatara-view_1_700_0

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy