సమ్మర్ ఫుడ్: అంబలితో హెల్దీ

finger-milletసమ్మర్ లో ట్రెడిషినల్ ఫుడ్ బెటర్ అంటున్నారు డాక్టర్లు. జొన్నలు, రాగులు, సజ్జలతో చేసిన అంబలి తాగడంతో డీహైడ్రేషన్ సమస్యలుండవంటున్నారు. అంబలితో హెల్దీగా ఉండొచ్చని సూచిస్తున్నారు. సిటీ ప్రజలకు కూడా అవగాహన పెరగడంతో గతంకంటే రాగులు, జొన్నల సేల్స్ బాగున్నాయంటున్నారు.

ఎండలు మండిపోతున్నాయి…రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరగుతున్నాయి. ప్రజలు పగటి పూట బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే చిన్న పిల్లలు, వృద్ధులు డిహైడ్రేషన్ భారిన పడుతున్నారు. ఓల్డ్ జనరేషన్ సజ్జలు, రాగులు, జొన్నల ఆహారం తినేవారు. కానీ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అవ్వడంతో.. నేటి తరానికి వీటి పేర్లు కూడా సరిగ్గా తెలీవు. కానీ నాటి ఫుడ్డే.. నేడు గుడ్ అంటున్నారు డాక్టర్లు.

ఐతే ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే సజ్జలు, జొన్నలు, రాగులతో చేసిన అంబలి తాగడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినిరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి. పొద్దంతా కష్టం చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను ఆహారంలో తీసుకుంటారు. గతేడాది కన్నా ఈసారి రాగులు, సజ్జల అమ్మకం బాగుంది అంటున్నారు వ్యాపారాలు.

ఎండాకాలం రాగి జావ రోజూ ఒక కప్పు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతోపాటు 2 నుంచి 3 లీటర్ల మంచినీరు, లిక్విడ్ ఫుడ్, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూనే వ్యాయామం కూడా చేయాలంటున్నారు డాక్టర్లు.

సో…మీరు కూడా ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేయండి. టేస్ట్ కి టేస్ట్… హెల్త్ కి హెల్త్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy