సమ్మర్ సెగలు : ఇండియా మండిపోతుంది

fire-indiaఇండియాలో ఎండాకాలం మంటలు మొదలయ్యాయి. భగ్గుమంటోంది దేశం. ఏ విధంగా ఉంది ఉంటే.. శాటిలైట్ విడుదల చేసే చిత్రం కూడా ఎర్రగా కనిపిస్తోంది. నాసా విడుదల చేసిన ఫొటో చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. మండే ఎండల వల్ల.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్స్, పొలాల్లోని పంటల కోతల తర్వాత వాటిని పెడుతున్న మంటలను ఈ చిత్రం కళ్లకు కడుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఎర్రటి స్పాట్స్.. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను సూచిస్తోంది. నాసా ఆధ్వర్యంలో నడిచే ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఈ విషయాన్ని చెబుతోంది.

హర్యానా, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పంటల దహనాలు, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలోని 33 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ఎక్కువ భాగం తగలబడుతూ ఉన్నాయి.

మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వరకు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్ తో జనం పరేషాన్ అవుతున్నారు. వడగాల్పుల తీవ్రతతో బయటకు వెళ్లాలంటేనే జంకుతిన్నారు. మరో వారం రోజులు వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా జగిత్యాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది . ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్ లోనూ 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకి చేరింది.

1986 నుంచి 1993 వరకు ఏటా 13 రోజులు మాత్రమే వడగాల్పులు వీచాయి. గతేడాది ఏకంగా 23 రోజుల వరకు వడగాల్పులున్నాయని చెబుతున్నారు అధికారులు. గ్లోబల్ వార్మింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగింది. రాష్ట్రంలో టెంపరేచర్ 44 డిగ్రీలు దాటడంతో వచ్చే వారం రోజులు ఇదే స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెబున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy