సమ్మెకు సై : ఎక్కడి లారీలు అక్కడే

తమ డిమాండ్లు నేరవేర్చాలంటూ శుక్రవారం(జూలై-20) నుంచి లారీల యజమానులు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ లారీలకు బ్రేక్‌ లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె కారణంగా రెండు మూడ్రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.

ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి నుంచి కూరగాయల సరఫరా తగ్గుముఖం పట్టగా, లారీల సమ్మెతో అది మరింత తీవ్రం కానుంది. టమాటా ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.35 పలుకుతుండగా, మిర్చి కిలో రూ.110కి చేరింది. మిగతా కూరగాయలు ధరలు సైతం ఇప్పటికే రూ.20 నుంచి రూ.40 వరకు ఉండగా అవన్నీ క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. వీటితో బియ్యం, పప్పులు ఇతర సరుకులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

డీజిల్‌ ధరలు GST పరిధిలోకి తేవాలంటూ దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించాలని లారీల యజమానులు ముఖ్యంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే టోల్‌ గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్‌ పార్టీ ఇన్సురెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, TDS వసూలు రద్దు చేయాలన్నవి మిగతా ప్రధాన డిమాండ్లు. దీంతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలుచేయాలని, అలాగే ప్రమాదం.. ఓవర్‌ లోడ్‌ విషయంలో డ్రైవర్‌ లైసెన్స్‌ రద్దు విధానాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు సమ్మె తలపెట్టారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy