సమ్మె.. నాకు నచ్చని మాట

rajiniసమ్మె అంటే తనకు నచ్చదని సంచలన ప్రకటన చేశారు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. సమస్య ఏదైనా.. ఇగోలను పక్కనబెట్టి ప్రజల బాగు గురించి ఆలోచించాలని.. చర్చల ద్వారా ఎప్పుడూ ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలన్నారు. తనకు నచ్చని మాటల్లో సమ్మె ఒకటి ఈ సందర్భంగా అన్నారు రజినీకాంత్.  “ఓ సీనియర్‌ నటుడిగా నిర్మాతల మండలి, ఫెప్సీకి విజ్ఞప్తి చేస్తున్నా.. మీరిద్దరూ మాట్లాడుకుని ఈ సమస్యకు ఓ మంచి పరిష్కారంతో రండి” అంటూ సూచించారు.

కథానాయకుడు విశాల్‌ ఆధ్వర్యంలోని తమిళ నిర్మాతల మండలి ఇటీవల ఫెప్సీలో సభ్యులు కాని టెక్నీషియన్లను నిర్మాతలు తమ చిత్రంలో తీసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వర్కర్స్‌కు తగిన డబ్బులు చెల్లించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని అయితే కొందరు ఫెప్సీ వర్కర్స్‌ ఇష్టారీతిన రెమ్యునరేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారని దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఓ ప్రకటనలో మండలి పేర్కొంది. ఫెప్సీలో దాదాపు 25,000 మంది సభ్యులున్నారు. ఇక మరోవైపు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి కార్మికుల జీతాలను పెంచాలని కోరుతూ తాము చేస్తున్న డిమాండ్‌ నెరవెరక పోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీని ప్రకారం మంగళవారం నుంచి సమ్మెకు దిగడంతో ఫెప్సీలో సభ్యులుగా ఉన్న కార్మికులు ఎవరూ చిత్రీకరణల్లో పాల్గొనలేదు. దీనిపైనే  రజినీకాంత్ స్పందించారు. మరోవైపు రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న ‘కాలా’ సినిమా చిత్రీకరణ మంగళవారం నిలిచిపోయింది. ఈ సినిమా కోసం చెన్నైలో ప్రత్యేక సెట్‌ ఏర్పాటు చేశారు. దీంతో సకాలంలో ఇక్కడ చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ముంబయి నుంచి కొత్త బృందాన్ని తెప్పించే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy