సరదానేకానీ.. దండలు పోయి దారాలు మిగిలాయ్

weddingపెళ్లి స‌మ‌యంలో వ‌ధూవ‌రుల‌చేత కొన్ని గేమ్స్ ఆడించ‌డం చాలా చూసుంటాం. ఒక బిందెలో ఉంగ‌రం వేసి ఎవ‌రు ముందుగా ఆ ఉంగ‌రం తీస్తే వారిదే వైవాహిక జీవితంలో పైచేయి అవుతుంద‌నే న‌మ్మ‌కం. ఇది స‌ర‌దాకోసం ఆడే ఆట‌. ఇలానే రాజ‌స్థాన్‌కు చెందిన ఓ జంట పెళ్లి వేదిక‌పై దండ‌లు మార్చుకునేందుకు పోటీ ప‌డ్డారు. నేను వేస్తానంటే..కాదు నేనే ముందుగా వేస్తానంటూ భ‌లే పోటీప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఇద్దరి చేతుల్లో కేవ‌లం దండ‌ను చేసేందుకు వాడే దారం మాత్రమే మిగిలింది. ఒక‌రి కంటే ముందు ఒక‌రు దండ‌వేయాల‌ని పోటీప‌డ‌టంతో దండ‌కు ఉన్న పూలు అన్నీ రాలిపోయాయి. స‌ర‌దాగా స్టార్ట్ అయిన ఈ ఆట‌.. చివ‌ర‌కు వ‌ధూవ‌రులు మాట్లాడ‌కుండా ముభావంగా ఉండేలా చేసింది. ఈ స‌ర‌దా స‌న్నివేశాన్ని పెళ్లికి వ‌చ్చిన వ‌ధూవ‌రుల స్నేహితులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy