సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీ సేన

virat-kohli-teamఅరుదైన గెలుపుకు మరో అడుగుదూరంలో ఉంది కోహ్లీ సేన. శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే  2 – 0 తో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టులో గెలిస్తే.. 85 ఏళ్ల చరిత్రను తిరగరాసినట్టే. తొలి టెస్టులో 304 పరుగుల తేడాతో విజయం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో గెలుపు.. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం సాధించిన భారత్.. శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో వైట్‌వాషే లక్ష్యంగా బరిలో దిగుతోంది.

ఈ టెస్టులో శ్రీలంకతో పోలిస్తే భారత్ కు మెరుగైన అవకాశాలున్నాయి. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో బలంగా ఉంది కోహ్లీ సేన. అరుదైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతోంది. పేస్ కు అనుకూలంగా పిచ్ ను తయారు చేసిన నేపథ్యంలో భువనేశ్వర్‌ కుమార్‌ రూపంలో మూడో స్పెషలిస్ట్‌ పేసర్‌ను జట్టులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. అతను ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్య స్థానంలో జట్టులోకి రావొచ్చు. రవీంద్ర జడేజాపై సస్పెన్షన్‌ వేటు పడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ రెండో స్పిన్నర్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి.  మరోవైపు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఊపు మీదుంది. లంక బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ తొలి రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో 600పైన పరుగులు సాధించింది. ధావన్‌, రాహుల్‌, రహానె, పుజారా, కోహ్లితో పాటు లోయర్‌ ఆర్డర్‌ పరుగుల వరద పారిస్తోంది.

ఇక లంక ఆశలన్నీ ఆ జట్టు యువ కెరటం కుశాల్‌ మెండిస్‌పైనే పెట్టుకుంది. పల్లెకలె పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు కుశాల్‌ (176) పేరిటే ఉంది. బౌలింగ్ లోనూ యువ పేసర్లు తమ బలమని నమ్ముతున్న లంక.. ఇప్పుడు అదే అస్త్రాన్ని భారత్‌పై ప్రయోగించనుంది. గాయపడి తప్పుకున్న నువాన్‌ ప్రదీప్‌, రంగన హెరాత్‌ స్థానంలో యువ పేసర్లు చమీర, గమాగెలను జట్టులో చేర్చుకుంది. అటు భారత్ కూడా బౌలింగ్ లో పటిష్ఠంగా ఉంది.

టీమ్స్.. ఇలా ఉండొచ్చు

టీమిండియా: ధావన్‌, రాహుల్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, అశ్విన్‌, సాహా, పాండ్య, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, షమి

శ్రీలంక: తరంగ, కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌, చండిమాల్‌ (కెప్టెన్‌), మాథ్యూస్‌, డిక్వెలా, ధనుంజయ డిసిల్వా, దిల్రువాన్‌ పెరీరా, చమీరా, సందకన్‌, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy