సరికొత్త రికార్డుకు ఇస్రో రెడీ

ISROsatellitelaunch_PSLVc33పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు ఇస్రో రెడీ అయింది. ఒకే రాకెట్ తో.. 103 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. భారత్ కు చెందిన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్ తో పాటు.. మరో 103 నానో శాటిలైట్లను PSLV-C37 ద్వారా నింగిలోకి పంపుతోంది. రేపు ఉదయం 9గంటల 28 నిమిషాలకు ప్రయోగం మొదలుకానుంది.

103 చిన్న ఉపగ్రహాల్లో ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-1బీ శాటిలైట్లు మనదేశానికి చెందినవే. మిగతా 101 శాటిలైట్లు వివిధ దేశాలకు సంబంధించినవి. వీటిలో…అమెరికాకు చెందిన 88 డవ్ రకం శాటిలైట్లు..మరో 8 లెముర్ శాటిలైట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన BGUశాట్, కజకిస్థాన్ కు చెందిన అల్ ఫరాబీ-1 శాటిలైట్, నెదర్లాండ్స్ కు చెందిన పీస్ శాటిలైట్, స్విట్జర్లాండ్ కు చెందిన డిడో-2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నయీఫ్-1 ఉపగ్రహాలున్నాయి.

ఇస్రో చరిత్రలో ఇది 39వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ప్రయోగం. ఈ 103 ఉపగ్రహాలు నానో శాటిలైట్లు కావడం వల్లే.. ఒకే రాకెట్ లో ప్రయోగించడానికి వీలవుతోంది. ప్రధానమైన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్ బరువు 714కేజీలు. 103 కో – ప్యాసింజర్ శాటిలైట్ల మొత్తం బరువు 664 కేజీలు. రాకెట్ మోసుకెళ్తున్న మొత్తం శాటిలైట్ల బరువు 1378 కేజీలు.

ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. 28 నిమిషాల 42 సెకన్లలో ప్రయోగం పూర్తి కానుంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy