సర్కారీ కొలువు కావాలా.. అయితే వెయిట్ చేయాల్సిందే

govt jobsఉద్యోగాల నోటిఫికేషన్స్ జారీకి మరికాస్త టైం పట్టనుంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా…నోటిఫికేషన్ జారీకి సమస్యలు తప్పడం లేదు. ఇంతకీ ఏంటా సమస్యలు…? ఎంత సమయం పట్టనుంది…? ఉద్యోగుల నోటిఫికేషన్స్ కు బ్రేక్ వేస్తున్న సమస్యలపై స్పెషల్………..

కొత్త రాష్ట్రం…కొత్త ప్రభుత్వం..ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు. నిరుద్యోగుల ఆశలకు తగ్గట్టుగా…సర్కార్ కూడా లక్షా 7వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అయితే ఆచరణ మాత్రం అంతాఈజీ కాదని తెలుస్తోంది. నోటిఫికేషన్ల జారీకి చాలా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

నోటిఫికేషన్స్ అంత ఈజీ కాదు

సీఎం నిర్ణయంతో…ఏఏ డిపార్ట్ మెంట్లలో ఖాళీలు ఉన్నాయో కసరత్తు చేసిన ఆర్థిక శాఖ…మొత్తం 9 వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందులో సాధారణ డిగ్రీ చేసిన నిరుద్యోగులకు మాత్రం.. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. దీనికి మెయిన్ గా మూడు కారణాలు ఉన్నాయి. ఉద్యోగుల సర్దుబాటు… కమలనాథన్ కమిటీ పంపకాలు ఫైనల్ చేయకపోవడం.. కాంట్రాక్టు ఎంప్లాయిస్ రెగ్యులరైజేషన్. ఇలా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు ముడిపడి…నోటిఫికేషన్ల జారీకి బ్రేక్ వేస్తున్నాయి.

విభజన జరిగిన వెంటనే ఉద్యోగుల పంపకాలపై కమలనాథన్ కమిటీని నియమించింది కేంద్రం. కానీ నెలలు గడుస్తున్నా కమిటీ మాత్రం ఉద్యోగుల పంపకాలను ఫైనల్ చేయలేదు. పూర్తి పంపకాలు ఫైనల్ అయ్యేందుకు మరో నాలుగైదు నెలలు పట్టే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. మరోవైపు అన్ని డిపార్ట్ మెంట్లలో ఉద్యోగుల సర్దుబాటు కావాలంటోంది ఆర్ధిక శాఖ. ఇది కూడా నోటిఫికేషన్ జారీకి అడ్డంకిగా మారింది. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులరైజేషన్ పై క్లారిటీ రాలేదు. డిపార్ట్ మెంట్ల వారిగా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు..? క్రమబద్దీకరణకు ఎన్ని ఏండ్ల సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలి…ఇలా ప్రతిదీ సమస్యగా మారింది. అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ పై సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ…సీఎంకు నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 28 వేల మందిని పర్మినెంట్ చేయాల్సి ఉంది.

నోటిఫికేషన్స్ కు రెడీగా ఉన్న పోస్టులు 4 వందలే

మొత్తం లక్షా 7 వేల పోస్టులు భర్తీ చేస్తామన్న సర్కార్…అన్ని డిపార్ట్ మెంట్లలో  దాదాపు 16 వేల పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఇందులో TSPSC ద్వారా 3వేల 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే సాధారణ డిగ్రీతో భర్తీ చేసే పోస్టులు కేవలం 4వందల మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ధిక శాఖ కూడా వీటికి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోస్టుల భర్తీపై TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా సీఎస్ తో చర్చించారు. అయితే సాధారణ డిగ్రీ చేసిన వారు లక్షల్లో ఉంటే.. కేవలం 4వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. నిరుద్యోగులను నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు TSPSC సభ్యులు.

అప్పు చేసి.. కోచింగ్ తీసుకున్న చాలామంది నిరుద్యోగులు.. బతుకు భారంగా గడుపుతున్నారు. సర్కార్ నోటిఫికేషన్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy