సర్కారీ గోల్డ్ కాయిన్స్ వచ్చేస్తున్నాయ్

424636-goldcoin740మన దేశంలో అధికారికంగా తొలి బంగారు నాణెం త్వరలో అందుబాటులోకి రానుంది. అశోక చక్ర ముద్రతో దీన్ని తయారు చేస్తున్నారు. నవంబర్ 5న గోల్డ్ కాయిన్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. 5, 10 గ్రాముల బరువుతో ఈ నాణేలు తయారవుతున్నాయి. దీంతో పాటు.. గోల్డ్ మానిటైజేషన్, గోల్డ్ బాండ్ పథకాలను అదే రోజు ప్రారంభిస్తారు ప్రధాని. బంగారంపై పెట్టుబడులను మళ్లించేందుకు గోల్డ్ బాండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రజలు, సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని వినియోగంలోకి తెచ్చి, వాటి ద్వారా ఆదాయం పొందేందుకు గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది. దీపావళి పండుగకు ఎక్కువగా బంగారం కొనుగోళ్లు ఉంటాయనే భావనతో.. గోల్డ్ కాయిన్స్ తో పాటు రెండు కొత్త పథకాలను నవంబర్ 5న ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.

తొలి దశలో 5, 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. 5 గ్రాముల నాణేలు 20 వేలు, 10 గ్రాముల నాణేలు 30వేలు రిలీజ్ చేయనున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ ధరకే ప్రభుత్వం వీటిని అమ్మేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy