సర్కారీ పథకాల అమలుపై సీఎం నజర్

imagesస్టేట్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. గ్రౌండ్ లెవెల్లో స్కీమ్స్ ఇంప్లీమెంట్ ను స్కానింగ్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు…అన్నిశాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, JCలు..ఎస్పీలు హాజరవ్వనున్నారు. అమల్లో ఉన్నసర్కార్ పథకాలతో పాటు…భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లకు, ఎస్పీలకు సమావేశంలో డైరెక్షన్స్ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్ గా ఫోకస్ చేసిన అన్నదాతల కష్టాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. ఆత్మహత్యల నివారణకు చేపట్టే కార్యక్రమాలతో పాటు..రాష్ట్రలోని కరువు మండలాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. వీటితో పాటు…మిషన్ కాకతీయ సెకండ్ ఫేస్..వాటర్ గ్రిడ్….సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూ సేకరణ, పనుల డెవలప్ మెంట్ పై రిపోర్టు తీసుకునే ఛాన్స్ ఉంది. హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు…వాటిని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు డైరెక్షన్ ఇవ్వనున్నారు సీఎం.

Doublebedroomడబుల్ బెడ్ రూం ఇళ్ళపై  కలెక్టర్లతో చర్చించనున్నారు సీఎం. దసరాకు ఈ స్కీంకు శ్రీకారం చుట్టనుంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఇళ్లను నిర్మించనుంది. పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ, కళ్యాణ లక్ష్మి, దళితులకు మూడెకాల భూమి, గ్రామాజ్యోతి , రాష్ట్రంలొ కొత్త పరిశ్రమల ఏర్పాటు , భూకెటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపై కలెక్టర్లతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి జిల్లాల టూర్ పై  మీటింగ్ లో డిస్కషన్ జరిగే అవకాశముంది. టూర్ ప్లానింగ్ పై జిల్లా కలెక్టర్ల నుంచి డీటేల్స్ తీసుకోనున్నారు ముఖ్యమంత్రి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy