సర్కార్ కు ప్రతిపక్షాలు పెట్టిన రుణమాఫీ మంటలు

ASSEMBLY_2572697gరుణమాఫీ మంటలు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షాల టూర్లతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలు జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలతో సర్కారు తీరును ఎండగడుతున్నారు. రేపటి వరకు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి పార్టీలు. లేకపోతే 10న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తామని వార్నింగ్ ఇస్తున్నాయి.

యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పర్యటించారు కాంగ్రెస్ నేతలు. సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం బతుకమ్మల పేరుతో సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు నేతలు. ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేసింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పాపం సర్కార్ దేనన్నారు కాంగ్రెస్ నేతలు. అల్లాడ గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన నేతలు…తమ పోరాట ఫలితంగానే…చనిపోయిన రైతు కుటుంబాలకు సర్కార్ ఎక్స్ గ్రేషియాను 6 లక్షలకు పెంచిందన్నారు. అన్నదాతలు అధైర్య పడవద్దని సూచించారు కాంగ్రెస్ నేతలు. అల్లాడ గ్రామంలో రైతు యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ నేతలు. కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేశారు. మరోవైపు వరంగల్లో పోరుయాత్ర నిర్వహించారు టీడీపీ, బీజేపీ నేతలు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు నేతలు. కలెక్టరేట్ ముందు రైతు కుటుంబాలతో కలిసి ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాజీనామాకు డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాల పిల్లల చదువులు చెప్పిస్తామని హామీ ఇచ్చారు నేతలు.

ఇవాళ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర జరగనుంది. రేపటి వరకు జిల్లాల్లో యాత్రలు చేయనున్నారు నేతలు. అప్పటి వరకు సర్కార్ సింగిల్ టైం రుణమాఫీపై నిర్ణయం ప్రకటించకపోతే 10 న రాష్ట్ర బంద్ పాటిస్తామని చెబుతున్నాయి విపక్షాలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy