సర్కార్ తలరాత : పేదోళ్లంటూ ఇళ్లకు బోర్డులు

POOR1ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. దీన్ని సక్రమంగా నిర్వహించలేని సర్కార్ సిబ్బంది.. వినూత్న ఆలోచనకు పోయి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదోళ్ల ఇళ్లపై రాతలు రాసి.. బోర్డులు పెట్టి మరీ అవమానించింది. ఇది వాళ్లను అవమానించటమా.. సర్కార్ చేతగాని తనమా అంటూ సామాజికవేత్తలు గళమెత్తటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో అవినీతిని అరకట్టలేక చేతులెత్తేశారు అధికారులు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు లబ్దిదారుల ఇళ్లపై మీరు పేదవాళ్లంటూ రాసుకొచ్చారు. పేదలకు చౌకగా ఆహారపదార్థాలను అందించేందుకు నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ చట్టం కింద సంక్షేమ పథకం అమల్లో ఉంది. రేషన్‌ షాపుల ద్వారా సరకులను పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. చాలా ప్రాంతాల్లో ఈ సబ్సీడీ సరకులు పేదప్రజలకు చేరకుండా.. మధ్యవర్తులు దోచుకుంటున్నారు. దౌసాలోనూ సంక్షేమ పథకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో.. స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. వారు తీసుకున్న నిర్ణయం ఆ గ్రామస్తులను ఆవేదనకు గురిచేసింది.

లబ్దిదారులను గుర్తించేందుకు వీలుగా రేషన్‌ వస్తువులు తీసుకుంటున్న వారి ఇళ్ల గోడలపై నేను పేద కుటుంబానికి చెందిన వాడిని..రేషన్ తీసుకుంటున్నా అనే స్లోగన్ ను ఇంటి గోడలపై పసుపు కలర్ తో బ్యాక్ గ్రౌండ్ పెయింటింగ్ పై ఎరుపు రంగు అక్షరాలతో రాయించారు. లక్షా 50 వేల ఇళ్లపై ఇలా రాయించారు. అధికారుల చర్యలతో కంగుతిన్న గ్రామస్తులు.. తమను అవమానిస్తున్నారంటూ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన దౌసా అదనపు కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy