సర్కార్ పై యుద్ధం చేస్తాం

123అసెంబ్లీ నుంచి సభ్యుల సస్పెన్షన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి ప్రతిపక్షాలు. రైతు సమస్యలపై తమ పోరాటం ఆగదని… సర్కార్ దిగొచ్చే వరకు ఐక్యపోరాటం చేస్తామని హెచ్చరించాయి. అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా సభ్యుల సస్పెన్షన్ ను అభివర్ణించాయి. సభలో సర్కార్ తీరుపై విపక్ష నేతలు ఏమన్నారంటే…

జానారెడ్డి(సీఎల్పీ లీడర్): ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే వరకు పోరాటం ఆగేది లేదు. అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజిది. ప్రభుత్వ వ్యవహారశైలి మారాలి. నిబంధనలు మాకు తెలియవా… అలవిమాలిన హామీలు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది సర్కార్. మేధావులు, మీడియా సర్కార్ చర్యలపై ప్రతిస్పందించాలి. ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదు.. ప్రజాప్రతినిధులను ఎదిరించే నిరంకుశర చర్య ఇది…. సభ్యుల సస్పెన్షన్ నిరంకుశత్వ చర్య… సభ ద్వారా రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఆత్మహత్యలు ఆగాలన్నదే మా పోరాటం….  ప్రభుత్వానిది తప్పించుకునే చర్య.. సభ్యుల సస్పెన్షన్

కె.లక్ష్మణ్ (బీజేఎల్పీ లీడర్) : ప్రజాసమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక కావడం లేదు. ఈ సభ ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది సర్కార్. కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం… సభ నుంచి గెంటేసినంత మాత్రాన.. సర్కార్ తో రాజీ పడే ప్రశక్తే లేదు. అన్ని పక్షాలను కూడగట్టుకొని రైతుల పక్షాన నిలుస్తాం. మజ్లీస్ రైతుల సమస్యలపై వెనకడుగు వేసింది. ప్రజాక్షేత్రంలో సర్కార్ పై ఒత్తిడి పెంచుతాం.

రేవంత్ రెడ్డి(టీడీఎల్పీ డిప్యూటీ లీడర్): మామా అల్లుళ్లు… అసెంబ్లీని ఆటవిడువు కేంద్రంగా చేసుకున్నారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా లేని నిరంకుశ ప్రభుత్వమిది. రైతుల రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండాలి. 37 లక్షలమంది రైతుల రుణాలు వెంటనే చెల్లించాలి. రాజ్యానికి చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారు సీఎం. జెండాలను పక్కను పెట్టి రైతు రుణమాఫీయే ఎజెండాగా పోరాడతాం.

సున్నం రాజయ్య(సీపీఎం): రైతుల రుణమాఫీ చేయాల్సింది. సర్కార్ దిగివచ్చేవరకు మా పోరాటం ఆగదు. సర్కార్ పై ఐక్య పోరాటం చేస్తాం.

పాయం వెంకటేశ్వర్లు(వైసీపీ): అమలుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టారు. రైతుల ఆశలపై నీళ్లు చల్లి ఆత్మహత్యలకు కారణమయ్యింది సర్కారే. స్పష్టత కావాలని అడిగితే… ప్రతిపక్ష సభ్యులను గెంటేసింది.

రవీంద్రకుమార్(సీపీఐ): శాసనసభ రాచరిక పోకడలను తలపిస్తోంది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన పేలవంగా ఉంది. దేశంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో రెండో స్థానం రాష్ట్రానిది. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy