సర్కార్ వారి ఆన్ లైన్ షాపింగ్..!

online shopingఆన్ లైన్ షాపింగ్ ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఆన్ లైన్ షాపింగ్ చేయాలంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి వెబ్ సైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇవి కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏదైనా కొనాలంటే… నో డెలివరీ ఫెసిలిటీ అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చేది వెబ్ సైట్. అందుకే ఈ ప్రాబ్లమ్ లేకుండా ప్లాన్ చేస్తోంది స్టేట్ గవర్నమెంట్. గ్రామీణులకి కూడా సులభంగా ఉండేలా TS ఆన్ లైన్ పేరుతో కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది.

డైరెక్ట్ గా వెబ్ సైట్లో గానీ, దగ్గరలోని ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో గానీ ఐటం బుక్ చేసుకోవచ్చు. టీఎస్ ఆన్ లైన్ లో వస్తువులు బుక్ చేసుకుంటే ఏ మారుమూల విలేజ్ కైనా డెలివరీ ఇస్తారు. ఒకవేళ డెలివరీ బాయ్  అందుబాటులో లేకుంటే బుక్ చేసుకున్న ఈ సేవ, మీ సేవ సెంటర్లలోనే ఐటం డెలివరీ ఇస్తారు. గ్రామాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎక్కువగా వాడరు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆన్ లైన్ షాపింగ్ ను కంఫర్ట్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.

మామూలుగా చీప్ కాస్ట్ లో ఐటమ్స్ కావాలంటే ఆన్ లైన్ షాపింగే బెటరని అందరి ఒపీనియన్. అయితే… గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇందులో దొరికే వస్తువులు కాస్ట్ లీనే. చాలావరకు బ్రాండెడ్ వస్తువులనే వెబ్ సైట్లలో పెడతారు. కొందామంటే ధర కొండెక్కి కూర్చుంటుంది. ఇక అప్పుడప్పుడు పండగలకి ఆఫర్లు  తప్పా… రేట్ల మోత మోగుతుంది. క్వాలిటీ ఉన్న లోకల్ బ్రాండ్స్ కు వెబ్ సైటల్లో ప్లేసుండదు. అందుకే… కొత్త ప్లాన్ చేస్తోంది స్టేట్ గవర్నమెంట్. లోకల్ గా ఉత్పత్తయ్యే వస్తువులకు ఈ వెబ్ సైట్ లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా సంఘాలు, గిరిజన సహాకార సంక్షేమ సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు ఈ వెట్ సైట్ లో ప్రధానంగా స్థానం కల్పించనున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కలిసి.. రాష్ట్ర ఐటీశాఖ స్టార్ట్ చేస్తున్న ఈ వెబ్ సైట్ వినియోగదారుడికి, కొనుగోలు దారుడికి మధ్య అనుసంధానకర్తగా మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ ఆన్ లైన్ మార్కెట్ల లాగా మధ్యవర్తుల ప్రమేయం ఉండదు కాబట్టి… ఉత్పత్తి దారుడే నేరుగా వినియోగదారుడికి వస్తువు అమ్ముకునే వీలుంటుంది. సో… రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఫెసిలిటీస్ లే ఏమాత్రం తగ్గకుండా ప్రైవేట్ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లకు పోటీగా ఉండనుంది టీఎస్ ఆన్ లైన్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy