సర్కార్ సాయం : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

saloon-surayapetఓ చిన్న ప్రయత్నం అతిపెద్ద మార్పుకు దారి తీసింది. ఓ జీవితాన్ని మార్చింది. నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లతో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సెలూన్ కు లక్ష రూపాయలు కేటాయించింది. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం యండ్లపెళ్లి గ్రామంలో ఓ షాపును ఆధునీకరించారు. చెవిటి, మూగ అయిన వ్యక్తి.. చిన్న డబ్బాలో సెలూన్ నిర్వహించుకునేవాడు. పాడుబడినట్టుగా.. ఎలాంటి సౌకర్యాలు లేని ఈ డబ్బా గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. ఈ పాడుబడిన షాపు.. దానికి నిర్వహించే వ్యక్తి గురించి తెలిసిన అధికారులు వెంటనే స్పందించారు. సీబీఎఫ్ పథకం కింద లక్ష రూపాయలతో మోడ్రన్ సెలూన్ షాపుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కింద పాడుబడిన ఆ షాపు.. ఇప్పుడు ఇలా ఆధునికంగా తయారైంది. ఆ షాపును శనివారం (మే 20) స్వయంగా ప్రారంభించారు కలెక్టర్ సురేంద్ర మోహన్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy