సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షమే

Sarpanchరాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ని ప్రత్యక్ష  ఎన్నికల ద్వారానే ఎన్నుకునే విధానానికే మంత్రి వర్గ ఉప సంఘం మొగ్గు చూపింది.  వారం రోజులుగా కొత్త పంచాయతీ రాజ్ యాక్ట్ రూపకల్పన కోసం పంచాయితీ రాజ్ శాఖ   మంత్రి జూపల్లి  ఆధ్వర్యంలో మంత్రి  ఉప సంఘం కసరత్తు చేసింది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించాక, కొత్త డ్రాఫ్టు బిల్లుకు ఓకే చెప్పింది.  ఈబిల్లుకు సీఎం ఆమోదం తరువాత.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చట్టంగా ఆమోదించనున్నారు

రాష్ట్రంలో కొత్త పంచాయితీరాజ్ చట్టం రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గం ఉప సంఘం డ్రాఫ్టును పైనల్ చేసింది,  ఐదు రోజులుగా  కసరత్తు  చేసిన కమీటి తుది నివేదికను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కి అందచేసింది. కొత్త చట్టంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యాత ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది, చాల వరకు పాత పద్దతికే మొగ్గు చూపిన ఉప సంఘం ..కొన్ని కొన్ని అంశాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఏ నిర్ణయం చేసిన  రాజ్యంగంలోని 73,74 వ అధికరణం స్ఫూర్తికి  నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు అధికారులు.  స ర్పంచ్ ల కు విస్తృతాధికారాలు క ల్పించేలా తెలంగాణా  కొత్త  పంచాయ తీరాజ్ చ ట్టం సిద్దం అయ్యిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అన్ని విభాగాల్లో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అయినట్లే  పంచాయితీ రాజ్ పరిపాలన విభాగంలో కూడా ఇదే పద్దతి అమలు చేయనున్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ రాస్ట్ర పంచాయితీ రాజ్ ఛట్టం రూపకల్పన కోసం కేరళ,మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాల్లో అమలౌతున్న విధానాలను తెప్పించుకుని అధ్యాయనం చేసింది సబ్ కమిటీ.. స ర్పంచ్ ల చేతికే కార్య నిర్వ హ ణాధికారాల ను పూర్తిగా అప్ప గిస్తూ… విధుల ను కూడా స్పష్టంగా చ ట్టంలో పేర్కొనే దిశ గా స మావేశంలో చ ర్చించారు. నిధులు, కార్య నిర్వ హ క  అధికారాల తో పాటు స ర్పంచ్ ల కు అప్ప గించాల్సిన  అంశాన్ని కూడా పొందుపర్చారు. దీని ద్వారా గ్రామాల్లో స ర్పంచ్ ల , పాలక వర్గ సభ్యులకు జవాబుదారీతనం పెరగడంతో పాటు, నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందన్నది సబ్ కమిటీ ఆలోచన.

ప్రస్తుతం జిల్లా పరిషత్ , మండల పరిషత్ లలో అమలు చేస్తున్న ట్లుగానే పంచాయతీల్లోనూ కో ఆప్ష న్ సభ్యున్ని నియమించే ప్రతిపాదన కూడా చేసింది.  ప్రస్తుతం ఉన్న చట్టంలోనూ స్వయం సహాయక సంఘాలు లేదా ఫంక్షనల్ గ్రూప్ ల నుంచి కో ఆప్ష న్ సభ్యున్ని తీసుకోవచ్చనే అంశం ఉన్నప్పటికి… ఇది సరిగ్గా అమలు కావడం లేదని కమిటి అభిప్రాయ పడింది.    దీనికోసం కో అప్షన్ పద్దతిలో  విషయ ప రిజ్ఞానం ఉన్న సీనియర్ వ్యక్తిని  నియ మించుకునే అవకాశం ఉండాలని ప్రతిపాదించినట్లు సమాచారం.  రెండు అంతస్థుల కన్నా ఎక్కువ చేపట్టే భవన కట్టడాల కోసం గ్రామ పంచాయితీ బోర్డు అనుమతి తప్పని సరి చేసింది. దీనికి కనీసం రుసుమును కూడా పెట్టినట్లు తెలిసింది. ఇలా ఫీజులు విధించడం ద్వారా పంచాయితీలు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది కమిటీ. అలాగే వరుసగా రెండు ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ అమలు చేయాలనే అంశం పైనా భిన్నాభిప్రాయలు వ్యక్తం కావడంతో ఇది ముఖ్యమంత్రి నిర్ణయానికే వదిలేసినట్లు తెలుస్తుంది.

అలాగే పంచాయతీలోని జనాభాను బట్టి ఇద్దరు, ముగ్గురిని కూడా నామినేట్ చేసుకునే అవకాశాల పై కమిటీ సభ్యులు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.  ఇందులో గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు, గ్రామ  మహిళ సమాఖ్య అధ్యక్షురాలు, నిపుణులకు అవకాశం కల్పించడం వల్ల గ్రామ అభివృద్ధికి వారి సహకారం ఉపయోగ పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది.

ఇక ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనం కూడా ఉండాలని భావించిన సబ్ కమిటీ  పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని   డ్రాప్ట్ లో పెర్కోంది. దీనిని ఆలస్యం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సర్పంచ్ తో పాటు సభ్యులందరికి వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పేర్కొంటూ 1995లో విధించిన నిబంధ నను ఎత్తివేయాలని  కొన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనపై కూడా చర్చించిన కమిటీ..ఇది సాధ్యం కాదని తేల్చినట్లు సమాచారం.  సబ్ కమిటి అందించిన ఈ నివేదిక పై త్వరలో జరగబోయే అసెంభ్లీలో విస్తృతంగా చర్చించి చట్టం చేసి అమల్లోకి తేనుంది ప్రభుత్వం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy