సర్వత్రా ఆసక్తి : డిసెంబర్ 11పైనే అందరి చూపు

డిసెంబర్-11.. ఈ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయనేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం ఎన్నికలు పూర్తికాగా..డిసెంబర్-11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ‌, రాజస్థాన్ లో శుక్రవారం డిసెంబర్-7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్  11నే చేపట్టనున్నారు. తెలంగాణ, రాజస్థాన్‌ లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత…ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది.

ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2019లో జరగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ గా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వే సంస్థలు, టీవీల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుండటంతో రాజకీయ నాయకులకే కాకుండా అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy