సర్వ రోగాల కు ఒకే మందు.. సూర్య నమస్కారాలు..!

sunsalutationfinal

ఇవే సూర్య నమస్కారాలు

ఎక్కడ చూడు ఫాస్ట్ ఫుడ్… చెత్త చెత్తగా తినడం అడ్డదిడ్డంగా లావెక్కడం. తర్వాత జిమ్ములు చుట్టు ప్రదక్షణాలు చేయడం కామన్ అయిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి మన పెద్దలు పెట్టిన ఆచారాన్ని అసలు గుర్తే తెచ్చుకోవడం లేదు. జిమ్ములు చుట్టు తిరుగుతున్నారే కానీ మనకోసం ఉన్న సూర్యనమస్కారాలు ఫాలో అవ్వడం లేదు. ఆరోగ్య కోసం కొన్ని వందల యేళ్ల నుంచి సూర్యునికి నమస్కారాలు చేసే సంప్రదాయం ఉంది. సూర్యనమస్కారాలు మొత్తం పన్నెండు. ఒక్కో నమస్కారానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. జిమ్ లో చేసే ప్రతి ఎక్ససైజ్… సూర్య నమస్కారాల నుంచి పుట్టినవే. పురాణాల నుంచే ఆచారిస్తున్న ఆరోగ్య సూత్రం సూర్యనమస్కారం.

సూర్య నమస్కారాలంటే ఆధ్యాత్మికమైన ఆరోగ్య చిట్కాలు. సూర్యునికి పెట్టే మొదటి నమస్కారం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఈ నమస్కారాల వల్ల బరువు తగ్గుతారు. ఆరోగ్యం గా ఉంటారు. అన్నింటి కంటే ముందు బధ్ధకం పోయి రోజంతా యాక్టివ్ గా ఉంటారు. రెండో  నమస్కారం పొట్ట తగ్గించి స్మార్ట్ గా కనిపించేలా చేస్తుంది. డైజిషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. వెన్నులోని నరాలను మెరుగుపరుస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెడుతుంది.

మూడో నమస్కారం వల్ల పొట్టలో సమస్యలు తగ్గుతాయి. గాస్టిక్… అల్సర్ లాంటి సమస్యలు మన దరి కూడా చేరవు. మహిళల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ కు ఛాన్సే ఉండదు. ఇక స్పాండిలైటిస్ మహిళలకు కామన్ ప్రాబ్లమ్ దానిని సూర్యనమస్కారాలతో తగ్గించవచ్చు.

నాల్గవ ఆసనం ముఖ్యమైంది. ఈ ఆసనం వల్ల కాళ్లలో బోన్స్ గట్టిపడతాయి. బాడీలోని ఎక్స్ ట్రా కొవ్వును కరిగిస్తుంది. నరాలు సాగి ఫ్రీ వాక్ చేయగలుతాం. ఐదో నమస్కారంతో బ్లడ్ సర్య్కులేషన్ బాగుంటుంది. బీపీ, షుగర్ లాంటి రోగాలకు దూరంగా ఉంటారట.

 ఆరోనమస్కారం చేయటం వల్ల ఛాతీ విశాలమవుతుంది. దీని వల్ల అందమైన ఫిట్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇదే ఇప్పుడు జిమ్స్ లో చేసే సిక్స్ ప్యాక్ సిస్టమ్. ఇక ఏడో నమస్కారం నుంచి ఇవే ఆసనాలు రిపీట్ అవుతాయి. బరువు తగ్గడానికి సూర్యనమస్కారాల కంటే మంచి ఎక్సర్ సైజ్ మరొకటి లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ సూర్యనమస్కారం చేస్తే యోగా ఆసనాలు చేసినట్లే. వాటికి, వీటికి పెద్దగా తేడాలుండవు. కానీ త్వరగా వెయిట్ కంట్రోల్ చేయాలనుకునే వాళ్లు ఇప్పటికీ ఇదే పధ్ధతిని ఛూజ్ చేసుకుంటున్నారు.

యూట్యూబ్ లో నెలకు కొన్ని వేల మంది సూర్యనమస్కారాల కోసం సెర్చ్ చేస్తున్నారట. ఈ ట్రెడిషన్ మన భారత్ లోనే పుట్టింది. ఇప్పుడు భారత్ లో తప్ప అన్ని దేశాల్లోను ఈ నమస్కారాలు ఫాలో అవుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఫారన్ కల్చర్ అయిన జిమ్ సిస్టమ్స్ ను నమ్ముకుంటున్నాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy