సర్‌ప్రైజ్‌ అదిరింది : ‘మాయాబజార్’ స్టైల్లో ‘మహానటి’

saviనేడు బుధవారం(డిసెంబర్-6 ) అలనాటి అందాలతార, మహానటి సావిత్రి జయంతి సందర్భంగా ‘మహానటి’ సినిమా యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. టైటిల్‌ లోగోకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ వీడియోలో ‘మాయాబజార్‌’లోని పేటికను చూపించారు. దాన్ని ఓ మహిళ తెరిచారు. అందులోంచి ‘మహానటి’ అనే టైటిల్‌ బయటికి వచ్చింది. ఈ సన్నివేశాన్ని పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్‌లో.. ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది, మీకు పెళ్లైందా.. అయితే నన్ను చేసుకుంటారా?, అయ్యోరామ, నమో కృష్ణ, అలిగిన వేళనే చూడాలి, నన్ను వదిలి నీవు పోలేవులే, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’ అంటూ సావిత్రి సినీ కెరీర్‌కు సంబంధించిన డైలాగ్స్‌, పాటలను వినిపించారు. ఇలా చాలా ఆసక్తికరంగా ఈ వీడియోను రూపొందించారు.

నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. సమంత, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు ‘మహానటి’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా.. మార్చి 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy