సలేశ్వరం: తెలంగాణ అమర్ నాథ యాత్ర షురూ

Saleshwaramతెలంగాణ అమర్ నాథ యాత్ర మొదలైంది. నల్లమల్లలో ఆదివారం (ఏప్రిల్ 9) మొదలైన సలేశ్వరం జాతర.. ఐదు రోజులు జరగనుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షల మంది వస్తారని అంచనావేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్ల అమ్రబాద్ మండలం శ్రీశైలం వెళ్లే ఘాట్ మార్గం మధ్యలో సలేశ్వరం ఉంది. మన్ననూర్ చెక్ పోస్ట్ నుంచి ఘాట్ రోడ్లో 20 కిలో మీటర్లు వెళ్తే.. ఫరహాబాద్ చౌరస్తా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్లు అడవిలోకి పోతే… సలేశ్వరం గుట్ట ఉంటుంది. ఇక్కడి వరకు బండ్లు వెళ్తాయి. ఇక్కన్నుంచి  నడుచుకుంటూ వెళ్లాలి. స్వామిని దర్శించుకోవడమంటే అంతా ఈజీ కాదు. గుట్ట మీదనుంచి 6 కిలో మీటర్ల లోతున లోయలోకి నడవాలి. అడవి మధ్య నుంచి, రాళ్ల మీదనుంచి నడుచుకుంటూ వెళ్లాలి.

స్వామివారు మొదట చెంచులకు కనిపించారని చెబుతారు. అడవిలో  నీళ్ల కోసం వెతుకుతుంటే.. కుక్కలు సలేశ్వరాన్ని చూపించాయి. జలపాతం, గుండం, లింగం, కాలబైరవుడు, చెంచులకు కనపించాయట. అప్పట్నుంచి నల్లమల అడవిలో చెంచులే ఈ గుడి దగ్గర పూజలు చేస్తున్నారు. ఉగాది పండగ తర్వాత వచ్చే పున్నమికి  ఏటా సలేశ్వరం జాతర చేస్తారు. దేవున్ని లింగమయ్య అని పిలుస్తారు. లింగమయ్య ఎదురవ్వగానే గంగమ్మ దూకుతుంది. ఇదీ ఇక్కడి ప్రత్యేకత. అడవి చెట్ల వేర్ల నుంచి వచ్చే నీళ్లను భక్తులు తాగుతారు.

సలేశ్వరం జాతరకొచ్చే భక్తులకు కొన్ని సంఘాలు… అన్నదానంతో పాటు మంచినీళ్లు అందిస్తున్నారు. లింగమయ్యను ఏడాదిలో ఈ ఐదు రోజులు తప్ప.. మిగతా రోజుల్లో చూడలేం. చుట్టూ అడవి ఉండటంతో చెంచులు కూడా ఇక్కడికి వెళ్లరు. అందుకే సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్ నాథ్ యాత్ర అంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy