సల్మాన్ కు ఊరట కలిగే అవకాశం

salman-v62002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఇన్సిడెంట్ లో రోడ్డుపక్కన పేవ్ మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా… నలుగురు గాయపడ్డారు. వైల్ పార్లేలోని  ‘రాణి బార్ అండ్ రెస్టారెంట్’లో మందు కొట్టిన సల్మాన్ టయోటా లెక్సస్ వాహనాన్ని నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఆ షాపు ఎదురుగా పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా… నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తున్నది. అయితే,  ఇందులో గాయపడ్డ రవీంద్ర పాటిల్ ప్రధాన సాక్ష్యంగా చెప్పిన వాదనలో వేర్వేరు అంశాలు ఉన్నాయి. ఘటన సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడనే సాక్షి వాదనలో నిజమెంతో రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది.

అక్టోబర్  1 తర్వాతే దర్యాప్తులో మద్యం అంశం వెలుగులోకి వచ్చింది’ అని హైకోర్టు పేర్కొంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు ఈ ఏడాది మేలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన బాంబే  హైకోర్టును ఆశ్రయించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy