సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ ట్రైలర్ రిలీజ్

salmanసల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ట్యూబ్‌లైట్ ట్రైలర్ రిలీజైంది. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో భారత్‌-చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యుద్ధ సన్నివేశాలతో సాగే సినిమా కావడంతో ఇందులో దాదాపు 600 మంది సైనికులుగా నటిస్తున్నారు. సినిమాలో ప్రతీ సన్నివేశం వాస్తవికంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ 600 మందికి మన భారత సైనికులే ట్రైనింగ్ ఇచ్చారట. సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంలో చైనీస్‌ నటి చూచూ నటిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లోకం పోకడ తెలియని ఓ అమాయకుడి పాత్రలో నటించగా సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ చైనాతో యుద్ధంలో పాల్గొనే ఓ సైనికుడి పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అన్నాదమ్ముళ్ల పాత్రలో నటిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy