సహాయ నిరాకరణకు రెడీ అవుతున్న దళితులు

unaఉనాలో దళితులపై దాడి ఘటన గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దాడులకు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు రెడీ అవుతున్నారు దళితులు. ఉనా ఇన్సిడెంట్ తో ఏకతాటిపైకి వచ్చిన దళితులు.. దాడులు ఆపేంత వరకు సహాయ నిరాకరణకు ప్లాన్ చేస్తున్నారు. పశుకళేబరాలు తొలగించొద్దని, పారిశుధ్య పనులు చేయొద్దని డిసైడయ్యారు. ఈనెల 5న అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. 5 లక్షల మంది దీనికి అటెండవుతారని చెబుతున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు దళితులు.

ఉనా దాడిలో గాయపడిన నలుగురు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ.. డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రకటించారు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ డాక్టర్లు. అయితే బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. తమవారి హెల్త్ కండీషన్ బాగా లేదని.. మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా పంపించేస్తున్నారని ఆరోపించారు. బాధితుల బంధువుల ఆందోళనతో.. డిశ్చార్జ్ ఆర్డర్స్ వెనక్కి తీసుకున్నారు డాక్టర్లు. మరోవైపు ఉనా దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలను.. ఎల్లుండి పరామర్శించనున్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి.

దాడికి నిరసనగా జరిగిన పరిణామాల్లో… ఓ యువకుడు చనిపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఉనా జిల్లాలో కొద్ది రోజుల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసిన యోగేష్ హీరాభాయ్ సోలంకి… ఆదివారం చనిపోయాడు. దాడి ఇన్సిడెంట్ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన 20 మందిలో యోగేష్ కూడా ఒకడు. రాజ్ కోట్ లోని పరాబణిలో… గత నెల 19న మరో ఇద్దరితో కలిసి యోగేష్ విషం తాగాడు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ… ఆహ్మదాబాద్ లోని ఆస్పత్రిలో అతను చనిపోవడంతో… ఆందోళనలను ఉధృతం చేశారు దళితులు.

ఉనాలో దాడులకు పాల్పడ్డ వారిని పాసా చట్టం కింద అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తమకు భూములు కేటాయిస్తే… వ్యవసాయం చేసుకొని గౌరవంగా బతుకుతామంటున్నారు దళితులు. ఇక కళేబరాలను ముట్టుకునేది లేదని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy