సాగరతీరంలో పెట్టుబడుల సదస్సు

cii meet at vizagప్రపంచ స్థాయి భాగస్వామ్య  సదస్సుకు విశాఖపట్నం సాగరతీరం ముస్తాబైంది. విశాఖలో తొలిసారి జరుగుతున్న ఈ భారీ సదస్సును.. బాబు సర్కార్  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్  భాగస్వామ్యంతో.. ఆదివారం నుంచి  3 రోజులు జరగనున్న ఈ సదస్సుతో.. లక్ష కోట్లకు  పైగా పెట్టుబడులను  ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.

ప్రపంచాన్ని ఆకర్షించేలా… భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో మొదటి సారి జరుగుతున్న ఈ భారీ సదస్సుకు.. కేంద్ర పెద్దలతో పాటు… పారిశ్రామిక దిగ్గజాలు అటెండ్ కానున్నారు. అందరినీ ఆకట్టుకునేలా… సదస్సు ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ఎంట్రీ హాల్ నుంచి.. డైనింగ్ హాల్ వరకు.. అన్ని ఏర్పాట్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తాత్కాలిక నిర్మాణాలు.. అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.

భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహించనున్నట్టు విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. ఈ సదస్సులో భారీగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయని, వాటిని అమలు చేయడంలోనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని అన్నారు. ఇవాళ ప్రారంభం కానున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు.. ఎల్లుండి వరకు జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy