సాధువులకు పెన్షన్లు: యోగీ సర్కారు


ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాలక, ప్రతిపక్ష నేతలు హామీలు గుప్పిస్తారు. అన్ని వర్గాల వారికి తాయిలాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో సాధారణ ఎన్నిలకు మూడునెలల సమయం ఉండటంతో యోగీ సర్కార్ కూడా కానుకలను ప్రకటించింది. యూపీలోని సాధువులకు పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. 60 ఏళ్లు అంతకు పైబడి వయసున్న సాధువులకు ఈ పెన్షన్ ఇవ్వనున్నట్లు  తెలిపింది యోగీ ప్రభుత్వం.

పెన్షన్లు రాష్ట్ర పెన్షన్ పథకం కింద సాధువులకు అందజేస్తామని స్పష్టం చేసింది యూపీ ప్రభుత్వం. జనవరి 30 వరకు సాధువులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రయాగరాజ్‌లో కుంభమేళ జరుగుతున్న క్రమంలో ఈ ప్రకటన రావడం విశేషం.

ఒంటరిగా జీవిస్తున్న ప్రతిఒక్కరికి రూ.500 పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు ఇది రూ. 400 గా ఉన్నింది. ఇదే పథకం కింద సాధువులకు కూడా పెన్షన్లు అమలు చేస్తామని యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సాధువులకు పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే… దీనిపై  ఆరోపణలు గుప్పించారు విపక్ష నేతలు. ఎన్నికల ముందే సాధువులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సాధువులను, ఇతర హిందువులను తమవైపు తిప్పుకునేందుకే యోగీ ఆదిత్యనాథ్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy