సానియా ఇంట్లో పార్టీ చేసుకున్న పాక్ టీం

M_Id_144513_sania_shoaibహైదరాబాద్ లోని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట్లో పాకిస్తాన్ లోకల్ క్రికెట్ టీం ‘లాహోర్ లయన్స్’ పార్టీ చేసుకుంది. చాంపియన్స్ లీగ్ లో భాగంగా సానియా భర్త షోయబ్ మాలిక్ ఉన్న లాహోర్ లయన్స్- కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు సానియా తండ్రి, షోయబ్ తో పాటు లాహోర్ టీం అందరికీ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టీం అందరికీ హైదరాబాద్ బిర్యానీ రుచి చూపించాడు షోయాబ్. పెళ్లి తర్వాత షోయబ్, హైదరాబాద్ లో మ్యాచ్ ఆడడం ఇదే ఫస్ట్ టైం. అయితే సానియా మాత్రం సౌత్ కొరియాలో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో పాల్గొనడానికి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో షోయబ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో ఫెయిల్ అయ్యాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy