సానియా జోడీ శుభారంభం

saniya -hingis11అదే జోరు..అదే ఫలితం. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్  జోడీ ఈ సీజన్ ను కూడా టైటిల్ తో శుభారంభం చేసింది. బ్రిస్బేన్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ల జోడీ 7-5, 6-1 తేడాతో జర్మనీ జోడీ ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ పై విజయం సాధించి టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. మొదటి సెట్ లో కాస్త ఇబ్బంది పడ్డా ఈ వరల్డ్ నంబరవన్ జోడీ.. ఆ తర్వాత రెండో గేమ్ ను ఈజీగా చేజిక్కించుకుంది. సానియా-హింగిస్ జంటకిది వరుసగా 26వ విజయం.  దీంతో 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ)  జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది.  మరోవైపు ఈ ఇద్దరి కలిసి సాధించిన టైటిల్స్ సంఖ్యను 10కు పెరిగింది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy