సానియా మరిన్ని విజయలు సాధించాలి:సీఎం

SANIA-KCRఉమెన్స్ డబుల్స్ టెన్నిస్‌లో స్విస్ ప్లేయర్ మార్టినా హింగీస్‌తో కలిసి వాల్డ్ రికార్డు సృష్టించిన సానియా మీర్జాకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. సిడ్ని ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ గెలవడంతో వరుసగా 30 మ్యాచ్‌లు గెలిచి సానియా – హింగిస్ జోడి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 11 టైటిళ్లు గెలవడం ఆదర్శమన్నారు సీఎం. టైటిళ్లు గెలవడమే కాకుండా ఈ జంట వాల్డ్ నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోవడం కూడా అభినందనీయమన్నారు. సానియామీర్జా మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ర్టానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం తెలిపారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy