సానుభూతి కోసమే విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామా

dgp-mahender-reddyప్రజల్లో సానుభూతి కోసమే మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్టు తేల్చారు పోలీసులు. పక్కాప్లాన్ ప్రకారం.. అంతా తానై నడిపించారని.. దీని కోసం అర కోటి ఖర్చుపెట్టడానికి రెడీ అయినట్టు తెలిపారు6. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి.. చెప్పిన వివరాల ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి.. పరిశోధన చేసి… 9 మందిని నేరస్థులుగా గుర్తించారు. వీళ్లందరినీ అరెస్ట చేస్తామన్నారు మహేందర్ రెడ్డి. విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని… డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తామన్నారు.

4 నెలల క్రితమే దీనికి ప్లాన్ చేసుకున్నారు విక్రమ్ గౌడ్. ఏప్రిల్ లో స్కెచ్ వేస్తే.. జూలైలో అమలు చేశారు. జనంలో సింపతీ అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈ నేరానికి పాల్పడ్డారు విక్రమ్. మొదటి నుంచి చివరి వరకు యాక్టీవ్ గా ఇన్వాల్ అయ్యి వర్క్ చేశాడని తెలిపారు. కడకపు చెందిన ప్రసాద్ కు ప్లాన్ చెప్పారు విక్రమ్. ఆ తర్వాత అదే కడపకు చెందిన గోవింద్ రెడ్డి ద్వారా ప్లాన్ అమలుచేయాలనుకున్నాడు. అతను నందకుమార్, కదిరికి చెందిన షేక్ అహ్మద్, బాబూ జాన్ లను దీనిలో ఇన్వాల్ చేశాడు. వీళ్లందరూ కలిసి గన్ కొనడానికి ఇండోర్ కు చెందిన రయీజ్ ను కలిశారు.

మొదట గోవిందరెడ్డి అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విక్రమ్ ఒత్తిడి తెచ్చాడు. నువ్వు చేయలేవా.. గాజులువేసుకున్నావా అంటూ మెసేజ్ లు కూడా పెట్టాడు. అలా గోవింద్ రెడ్డి.. నందకుమార్ అండ్ గ్యాంగ్ ను రంగంలోకి దించాడు. నందకుమార్ కు క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉంది… చైన్ స్నాచింగ్, ల్యాండ్  విషయాల్లో … హస్తం ఉంది. నందకుమార్ టాస్క్ కు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వెంకటరమణ అలియాస్ చిన్నా అనే మరో వ్యక్తి వీరితో కలిశాడు. జూలై 8న వెపన్ విక్రమ్ గౌడ్ కు చేరింది. అప్పటి నుంచి  జూలై 28 వరకు గన్ విక్రమ్ ఇంట్లోనే ఉంది. వీళ్లందరికీ అపోలో హాస్పిటల్ సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్ లో నివాసం కల్పించాడు విక్రమ్. అక్కడే చర్చలు జరిగాయి. ఇంటికి కూడా పిలిచి తన డ్రాయింగ్ రూమ్ లో చర్చలు జరిపాడు. ఎలా కాల్చాలి.. ఎలా వెళ్లాలి.. అనే విషయాలపై మాట్లాడాడు. తప్పించుకునేందుకు రెక్కీ కూడా నిర్వహించాడు. నందకుమార్ అండ్ గ్యాంగ్ దీనిపై త్వరగా ముందుకు కదకలపోతే మోటివేట్ కూడా చేశాడు. ఎలాంటి కేసులు ఉండవని చెప్పాడు.

చాంద్రాయణగుట్టలో టూవీలర్ తీసుకుని దాని ఇంజన్ నంబర్, ఛాసిజ్ నంబర్ మార్పించారు.  దాన్ని తీసుకువచ్చి విక్రమ్ ఇంట్లోనే పెట్టారు. నంబర్ ప్లేట్ మార్చారు. ఈ విషయాన్ని వాచ్ మన్ ధ్రువీకరించారు. జూలై 25న ప్లాన్ అమలు చేద్దామనుకుంటే.. నందకుమార్ అండ్ గ్యాగ్ కాస్త ఆలోచనల్లో పడింది. నమ్మకం కుదరక అందరూ కదిరి వెళ్లిపోయారు. దీంతో గన్ అమ్మిన రయీజ్ నే దీనిలో ఇన్వాల్ చేయాలనుకున్నారు. నందకుమార్, షేక్ అహ్మద్ … రయీజ్ తో మాట్లాడి హైదరాబాద్ రప్పించారు. వీళ్లంతా ఎవరికి వారు హైదరాబాద్ చేరకున్నారు. నందకుమార్ స్కార్పియోలో హైదరాబాద్ కు 27 వచ్చాడు. షేక్ అహ్మద్, రయీజ్ లను కలిశాడు. వీళ్లు విక్రమ్ ను కలిశారు. ప్లాన్ అంతా మళ్లీ చర్చించుకున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలోని తమ ఫ్లాట్ కు వెళ్లారు. అక్కడ మళ్లీ చర్చించారు. ఒకటికి రెండు సార్లు.. విషయాన్ని చెప్పి… వాళ్లను మోటివేట్ చేశాడు. ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పాడు. రెండు సార్లు తప్పించుకునే రూట్ ను తన  కారులో నుంచి చూపించాడు.

27 అర్ధరాత్రి విక్రమ్ తన ఇంటికి వచ్చాడు. తనతో పాటు నందకుమార్, షేక్ అహ్మద్, రయీజ్ లను తీసుకువచ్చాడు. ముందు తను ఇంటిలోకి వెళ్లి… ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్లను రమ్మన్నాడు. తన స్నేహితులు వస్తారంటూ వాచ్ మన్ తో చెప్పి… గేట్ తీసి పెట్టమన్నాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత భార్యను దర్గాకు వెళ్లాలని రెడీ అవ్వమని చెప్పాడు. ఆమె రెడీ అవుతుండగా.. వీళ్లను రమ్మని.. పిలిచి వెపన్, 8 లక్షల క్యాష్ ఇచ్చాడు. దీనిలో నందకుమార్ కు 4 లక్షలు, రయీజ్, షేక్ అహ్మద్ లకు చెరో 2 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత 3.30 సమయంలో ప్లాన్ అమలు చేశారు. భుజాలపై, కడుపులో మూడు రౌండ్లు కాల్పులు జరపాలి. అయితే మూడో రౌండ్ లో స్ట్రక్ అవ్వడంతో.. ఏం చేయాలో తెలియక.. అక్కడి నుంచి జంప్ అయ్యారు.

కాల్పుల తర్వాత ముందుగా అనుకున్నట్టుగా బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతా వాస్తవికంగా ఉండాలని చేశారు. హఫీజ్ నగర్ దగ్గర కుంటలో వెపన్ వేసేశారు. ఆ తర్వాత నిజామాబాద్, ఖమ్మం, విజయవాడల మీదుగా కదిరి చేరుకున్నారు. నందకుమార్ స్కార్పియోలో ఒంటరిగా వెళ్లాడు.

వీళ్లపై 326 ఐపీసీ, 109 ఐపీసీ, 120బీ , 201 ఐపీసీ, 203ఐపీసీ, ఇండియన్ యాక్ట్ 25, 27 ప్రకారం కేసులు నమోదు చేశామని.. కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విక్రమ్ గౌడ్ భార్య శిల్పాలికి ఎలాంటి సంబంధం లేదని.. ఈ విషయాలేవీ తెలియవని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy