సామాన్యుడితో జపాన్ యువరాణి పెళ్లి

Princess-Makoపాతాళభైరవి సినిమా గుర్తుందిగా.. అందులో సామాన్య యువకుడైన తోటరాముణ్ని ప్రేమిస్తోంది యువరాణి. సరిగ్గా అలాంటిదే కాకపోయినా… దీనికి దగ్గరగా ఉండే సంఘటన జపాన్ లో చోటుచేసుకుంది. ఆ దేశపు యువరాణి ఓ సామాన్యున్ని పెళ్లాడటానికి రెడీ అయ్యింది. ఈ వివాహంతో ఆమె రాణీవాసపు గౌరవ మర్యాదలు కోల్పోనుంది. అయినా… ప్రేమించిన వాడితో ఏడడుగులు నడవడానికే సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.  ఈ పెళ్లి ముచ్చట అక్కడ పెద్ద దుమారాన్నే లేపుతోంది. జపాన్ చక్రవర్తి అకిహిటో కు పెద్ద మనవరాలు మాకో.  25ఏళ్ల మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తోంది. ఆమె తన సహ విద్యార్థి… కాబోయే న్యాయవాది కి కుమొరోను ప్రేమించింది. వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించారు. జపాన్ రాచవంశపు ఆచారాల ప్రకారం ఆ ఇంటి ఆడపడుచులు.. సామాన్యులను వివాహం చేసుకుంటే… వాళ్లు రాచరికానికి దూరమవుతారు. అయినా… తన ప్రేమ కోసం సామాన్యురాలిగా మారడానికి రెడీ అయ్యింది మాకో.  అయితే ఈ సంపద్రాయంలో సవరణలు తీసుకురావాలంటున్నారు మెజార్టీ జపనీయులు.

ఇదిలా ఉంటే.. 84 ఏళ్ల చక్రవర్తి అకిహిటో.. వయోభారంతో ఇటీవలే పదవి విరమణకు సిద్ధమయ్యారు. ఇంకా వారసుడి ఎంపిక పూర్తికాకముందే… ఈ పెళ్లి పెద్ద చర్చకు దారితీసింది. చక్రవర్తికి ఇద్దరు కుమారులు. ముగ్గురు మనవరాళ్లు.. ఒక మనవడు. ఆయనకు తమ్ముడున్నాడు కానీ.. ఆయన కూడా వయోభారంతో ఉన్నవాడే. చక్రవర్తి ఎంపికపై ఆ దేశ కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే.. జపాన్ సంపద్రాయం ప్రకారం.. స్త్రీలు… పట్టాభిషేకానికి అనర్హులు. మరేం చేస్తారో చూడాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy