సామాన్యులకు ఉల్లి ఘాటు

onion_481739a_jpg_481739fనిన్న, మొన్నటి వరకు పది, పదిహేను రూపాయలకు కిలో ఉన్న ఉల్లిపాయల రేటు ఒక్కసారిగా మూడింతలు పెరుగడంతో ప్రజల్లో ఆందోళన కన్పిస్తుంది. మార్కెట్‌లో ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. కిలో ఉల్లి మార్కెట్‌లో రూ.36కు విక్రయిస్తున్నారు. దీనితో ఉల్లిగడ్డలు కోస్తేనే కాదు..కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయని వాపోతున్నారు నిరుపేదలు.వీటితో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. మొన్నటి వరకు ఠారెత్తించిన ధరలతో పాటు.. ప్రస్తుతం ఉల్లి ఘాటుకు సామాన్యులు సతమతమవుతున్నారు.

వారానికి కనీస రూ.300 వెచ్చిస్తే కానీ.. సామాన్యులు, మధ్యతరగతి వారికి కూరగాయలు లభించే పరిస్థితి లేదు. ఎంతటి వారైనా కూరగాయలు తప్పనిసరి. అందులో ఏ కూరగాయాలకైనా, మాంసానికైనా ఉల్లి మరీ ముఖ్యం. ఒక్కో కుటుంబం రోజుకు సుమారు 250 గ్రాములు ఉల్లిపాయలు వినియోగించడం ఖాయం. ధరలు అమాంతం పెరగడంతో రైతు బజార్లలో సైతం ఉల్లిగడ్డలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇప్పడు ఒక్కసారిగా పెరిగిపోయింది. అమాంతం పెరిగిన ధర చూసి వినియోగదారులే కాదు మార్కెట్లలో ఉల్లిని విక్రయించే చిరు వ్యాపారులు కూడా షాక్ తింటున్నారు. రైతు బజార్లలో కూడా ఉల్లిధరల్లో ఘననీయంగా మార్పు కనిపించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం మార్కెట్లో కలకలం రేపుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఉల్లి భారీగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ ఒక్క జిల్లాల్లోనూ ఉల్లి లేదు. మహారాష్ట్ర, కర్నాటకల నుంచి కూడా సప్లై ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన కర్నూలులోనూ ధరలు పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో 3రోజుల క్రితం ఉన్న ధరకు మూడు నాలుగు రెట్లు అధిక ధరలు ఇవాళ ఉన్నాయి. కర్నూలు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల ఉల్లి ధరలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు మార్కెట్ నుంచి హైదరాబాద్ వచ్చే ఉల్లి లారీల సంఖ్య భాగా తగ్గిపోయింది. దీంతో ఇప్పటికే ధరల పట్టిక వేగంగా మారిపోతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఉల్లిధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒకప్పుడు విజయవాడ పరిసరాల్లో భారీగా ఉల్లి పండేది.

ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పడినందున ఉల్లిపంట దిగుబడిపై ఆ ప్రభావం పడింది. పంట తగ్గిపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి విజయవాడ, గుంటూరు మార్కెట్లకు సప్లై అవుతోంది. ఇప్పుడు ఆ సప్లై ఆగిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన వరంగల్‌లోనూ ఎటు చూసినా ఉల్లి చర్చే నడుస్తోంది. మార్కెట్‌కు వచ్చే ఉల్లి తగ్గిపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. ఉల్లిధరలు ఊపందుకోవడంతో బ్లాక్‌మార్కెట్ కోరలు తెరిచింది. మార్కెట్లోకి వస్తున్న అతితక్కువ సరుకును గంపగుత్తగా కొని బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారులు కొనేందుకు వచ్చేసరికి ఉల్లిధర కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఆదివారం (ఆగస్టు-13) హైదరాబాద్ లో ఉల్లి ధర రూ.28గా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy