సాయం తెచ్చిన తంటా..!

article-2479194-1910BE9800000578-403_306x423వసుంధర రాజేకు పదవీ గండం

లలిత్ వీసా ఎపిసోడ్ లో వేటు తప్పదా?

లలిత్ మోడీ వీసా ఎపిసోడ్ బీజేపీని కుదిపేస్తోంది. కేంద్ర మంత్రి సుష్మాతో పాటు రాజస్థాన్ సీఎం వసుంధరరాజే  ఆమె కుమారుడు దుష్యంత్ ఈ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  IPL నిధుల గోల్ మాల్ వ్యవహారంలో లలిత్ మోడీ పై తీవ్ర ఆరోపణలున్నాయి. 2010 నుంచి బ్రిటన్ లోనే ఉంటున్న మోడీ వీసా విషయంలో వసుంధర సాయం చేసినట్లు సాక్ష్యాలు బయటకొచ్చాయి. దీంతో పాటు వసుంధర కుమారుడు దుష్యంత్ కు చెందిన నియంత్ హోటల్స్ లో లలిత్ మోడీ 11 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. 2010 లో దుష్యంత్ చెందిన హోటల్లోనే లలిత్ మోడీ నెలకు పైగా ఉన్నారు. ఈ టైంలో వసుంధరతో పాటు చాలా మంది వీఐపీలో ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.

లలిత్ మోడీ ఎపిసోడ్ లో నిందితులపై చర్యలకు కేంద్రం రెడీ అవుతున్నట్టు టాక్. ఇందులో మెయిన్ గా ఫస్ట్ వసుంధర పై వేటు పడే చాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అవినీతి కారణాలతో పాటు రాజకీయ రీజన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వసుంధరకు ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో సంబంధాలు అంతంతమాత్రమే. అటు రాజస్థాన్ లో వసుంధర ప్రత్యర్థి వర్గంతో అమిత్ షా సపోర్ట్ గా ఉంటున్నారు. మోడీ క్లీన్ ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా బీజేపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లలిత్ మోడీ బిజినెస్ పై ఎంక్వైరీ స్పీడప్ చేసింది ఈడీ . ఇందులో అక్రమాలను బయటపడితే లండన్ నుంచి మోడీని ఈజీగా తీసుకురావచ్చనేది కేంద్రం ప్లాన్. మరోవైపు మోడీ వీసా సాయం చేసిన సుష్మకు బీజేపీ హైకమాండ్ అండగా ఉన్న వసుంధర విషయాన్ని మాత్రం లైట్ తీసుకుంది. టోటల్ గా లలిత్ మోడీ వీసా విషయంలో చివరకు రాజస్థాన్ సీఎం వసుంధర సీఎం సీటుకు ఎసరు పెట్టేలా ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy