సాయిని కూడా వదలని పవన్ ఫ్యాన్స్

saidharmపవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీకి తలనొప్పిగా మారారా అంటే.. ఔననే సమాధానం వస్తోంది. మొన్న నాగబాబు.. నిన్న అల్లు అర్జున్.. ఇవాళ సాయి ధరమ్ తేజ.. హీరో ఎవరన్నది కాదు ముఖ్యం … పవర్ స్టార్ జై అనాల్సిందే. పవన్ పేరు ప్రస్తావన లేకుండా.. స్పీచ్ మొదలు పెట్టారంటే ఇక అంతే సంగతులు.. పవర్ స్టార్ .. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తిక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ దీనికి మరో ఉదాహరణగా నిలిచింది. శుక్రవారం నాటి ఈ ఆడియో ఫంక్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. చివర్లో సాయి మాట్లాడ్డానికి రెడీ అవుతుండగా … ఆడియన్స్ నుంచి క్లోజ్ చెయ్ అన్న మాట వినిపించింది..  దీంతో ఒక్కసారి సాయి ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. కొంత అసహనంతో… అయిపోతుంది బ్రదర్.. తొందరపడకండి అనగానే.. మరోపక్క నుంచి పవర్ స్టార్ నినాదాలు మార్మోగాయి. దీంతో చెప్పేశాను గా బ్రదర్.. మీరెన్నిసార్లు అనమంటే అన్నిసార్లు అంటాను. నేనీ స్థాయిలో ఉండటానికి వాళ్లే కారణం. మీరు అనగలరా .. ఎందుకు ఆపేశారు.. ఇంకా గట్టిగా అరవండి అంటూ.. ఫ్యాన్స్ ను నిలదీశాడు.

చివర్లో సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చాడు సాయి. ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి.. అమ్మ ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్తగా వెళ్లండి.. మీకేమైనా అయితే మేము తట్టుకోలేమంటూ ఫ్యాన్స్ కు జాగ్రత్తలు చెప్పాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy