సార్క్ దేశాలకు శాటిలైట్ చేసిద్దాం : పీఎం

modi-isro-radhakrishanఇస్రో చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్ వీ సి-23 రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా కక్షలోకి ప్రవేశ పెట్టారు సైంటిస్టులు. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇండియాది సుదీర్ఘ ప్రయాణమన్నారు. ఆర్యభట్ట ప్రయోగం మనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆర్యభట్ట నుండి పీఎస్ఎల్ వి సి-23 వరకు సైంటిస్టుల కృషి మరువలేనిదన్నారు. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట బెంగళూరు మెకానిక్ షెడ్ లో తయారైందని గుర్తు చేశారు. మన పూర్వీకులు జీరో కనిపెట్టపోతే.. మనం హీరోలు అయ్యేవాళ్లం కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో తక్కువ ఖర్చుకే ప్రయోగాలు చేస్తున్న దేశం ఇండయా అని, హాలీవుడ్ సినిమా గ్రావిటీ ఖర్చు కన్నా.. మన మార్స్ మిషన్ విలువ తక్కువన్నారు. సైంటిస్టుల ప్రయోగాలు ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. సైంటిస్టులు ఇండియాను అగ్రదేశాల సరసన నిలబెట్టారని కొనియాడారు.

పీఎస్ఎల్ వీ సక్సెసవ్వడంతో ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపారు మోడీ. భారతీయులు గర్వపడే క్షణాలివని, ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. 5 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన పీఎస్ఎలీ వాహక నౌక.. సొంత నావిగేషన్ వ్యవస్థకు పునాది పడుతుందని తెలిపారు. శాస్త్రవేత్తల కృషి వృధాగా పోదని, సైంటిస్టుల గొప్పదనం ప్రజలకు తెలియేజేస్తామన్నారు. శాస్త్రవేత్తల కృషి దేశ ప్రజల జీవితాలను మార్చుతుందని కొనియాడారు. యువతను పెద్ద ఎత్తున స్పేస్ ప్రయోగాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పీఎస్ఎల్ వీ ఇప్పటి వరకు 67 సాటిలైట్స్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందన్నారు. అగ్ర రాజ్యాలకు ధీటుగా దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందనీ, సార్క్ దేశాల కోసం ఒక శాటిలైట్ తయారు చేసి ఇద్దామని సైంటిస్టులనుద్దేశించి అన్నారు. దగ్గరుండి ప్రయోగం చూసినందుకు సంతోషంగా ఉందని, షార్ లో నాలుగు తరాల శాస్త్రవేత్తలను కలిసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy