సార్క్ శాటిలైట్ సూపర్ సక్సెస్

sarcజీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 09 రాకెట్ నింగిలోకి దూస్కెళ్లింది. 2,230 కిలోల బరువున్న జీశాట్‌ -9 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశించింది శాటిలైట్. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. సార్క్ సభ్య దేశాల మధ్య సాంకేతిక స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగం జరిగింది. పాకిస్తాన్ మినహా 7 సార్క్ సభ్యదేశాలు శ్రీలంక, భూటాన్, మల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కు ఉపయోగపడేలా రూ.235 కోట్ల వ్యయంతో భారత్ దీన్ని రూపొందించింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ 12 ఏళ్లపాటు భారత్ తోపాటు పొరుగు దేశాలకు ఉచితంగా సాంకేతిక సేవలందించనుంది. దక్షిణాసియాలో దేశాల మధ్య సమాచార మార్పిడి, విపత్తుల నిర్వహణలోనూ ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. సార్క్ దేశాలకు బ్రాడ్ బ్యాండ్, DTH సేవలను కూడా ఈ శాటిలైట్ అందించనుంది.

ప్రధాని అభినందనలు

GSLV-F09 ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు అభినందలు తెలిపారు ప్రధాని మోడీ. చారిత్రత్మాకంగా అభివర్ణించారు. ప్రాజెక్ట్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తల కృషి అమోఘం అన్నారు. సార్క్ దేశాలకు ఈ ప్రయోగం ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy