సావిత్రిబాయి పూలే కు గూగుల్ ఘన నివాళి

savitribai-phules-186th-birthday-google-doodle

భారత తొలి ఉపాధ్యాయురాలు, తొలి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలేకు గూగుల్ తన హోమ్ పేజీలో ఘన నివాళి ప్రకటించింది. సావిత్రిబాయి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకునేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది గూగుల్ సంస్థ.  దేశ ప్రజలంతా సావిత్రిబాయి పూలే 186వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మహిళల తేజోమూర్తి

పీడిత జాతుల విముక్తి ప్రదాత, ఆధునిక భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి .. బడుగు బలహీన వర్గాల ప్రజలకు పాఠాలు  చెప్పిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి. స్త్రీ ఇంటి నుంచి బయటకు రాకుండా అగ్రవర్ణాల ఆదిపత్యం ఉండే వ్యవస్థ ఉన్న కాలంలోనే.. మహిళల కోసం ప్రత్యేక విధ్యా సంస్థలను నెలకొల్పిన తొలి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి. కోటాను కోట్ల మందిని చైతన్య పరచి.. మహిళల జీవితాల్లో వెలుగు నింపిన చైతన్యమూర్తి ఆమె.

కుల వ్యవస్థకు చరమగీతం

మహిళా స్వేచ్ఛా, సమానత్వాలకు చిహ్నం ఆమె. గురువుకు నిజమైన నిదర్శనం ఆమె. సామాజికోద్యమానికి పునాది ఆమె. బాలికల విద్య, స్త్రీలు, బడుగుల కోసం జీవితాన్ని ఫణంగాపెట్టిన ఆదర్శ మూర్తి సావిత్రిబాయి పూలే. మహారాష్ట్ర కేంద్రంగా సామాజిక చైతన్యాన్ని రగిల్చిన యోధురాలు  సావిత్రాబాయి.

ప్రజల గుండెల్లో చిరకాలం..

జీవించడమంటే బతకడమని మాత్రమే మనకు తెలుసు. కానీ,  మరణించిన తర్వాత కూడా జీవించవచ్చని కొందరికే తెలుసు. అలాంటి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు సావిత్రి బాయి పూలే. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి పూలే … సాహసానికి , సామాజికోద్యమానికి మారు పేరు. ఆమెను ప్రస్తావించకండా  స్త్రీ స్వేఛ్ఛా, సమానత్వాల గురించి మాట్లాడలేం.

1840లో మహాత్మ జ్యోతిరావ్ పూలే ను వివాహం చేసుకున్న తర్వాత  ఆమె జీవితమే మారిపోయింది. చదువు కునేందుకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా నిలబడ్డారు. భర్త స్ఫూర్తితో  సామాజిక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అంటరాని కులాల బాలికలను చేరి దీసి, చదువు నేర్పించారు. 1848లో  సొంతగా ఓ పాఠశాలను స్థాపించారు. 1876 నుంచి 77 మధ్య మహారాష్ట్రలో 50 విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు.

అక్షరాలతోనే ఆత్మవిశ్వాసాన్ని నింపారు

భర్త నుంచి ప్రశ్నించే చైతన్యాన్ని నేర్చుకునన సావిత్రిబాయి పూలే అగ్రకలాల ఆధిపత్యాన్ని ఎదరించారు. చీత్కారాలు, రాళ్ల దెబ్బలను లెక్క చేయలేదు. రైతులు , కార్మికుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. అక్షరాలతోనే జీవితం మారుతుందని  స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. కావ్యపూలే, బవన్ కాశి సుబోధ్ రత్నాకర్ పేరుతో అనేక రచనలు చేశారు.

బ్రిటీష్ కాలంలోనే  ఉత్తమ టీచర్

వితంతువులకు కోసం 1853లో ఓ శరణాలయాన్ని స్థాపించారు సావిత్రి  పూలే.  వారికి వివాహాలు చేయడంతో పాటు వాళ్ల  పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఓ బిడ్డను  దత్తత తీసుకుని చదివించారు. మహిళలు, అట్టడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన  నాయకురాలిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి బ్రిటీష్ కాలంలోనే  ఉత్తమ టీచర్ గా ప్రశంసలు అందుకున్నారు సావిత్రి పూలే .  1897లో పూణేను ప్లేగు వ్యాధి వణికించింది. జనమంతా దగ్గర్లోని అడువుల్లోకి పారిపోవడంతో నగరం ఏడారిగా మారింది. కొడుకు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధి బాధితులకు సేవ చేశారు సావిత్రి పూలే. చివరకు ఆ వ్యాధే  1897 మార్చి 10న అమె ప్రాణాలు బలితీసుకుంది.

స్త్రీలు, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించిన సావిత్రి పూలే నేటి తరానికి ఆదర్శనియురాలు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy