సాహిత్య అకాడమీ, తెలుగు మహాసభ లోగోలు ఆవిష్కరణ

sahithyaతెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను సీఎం కేసీఆర్ మంగళవారం (జులై11) ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి. రమణారెడ్డి… తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించారు.

సాహిత్య అకాడమీ లోగో విశేషాలు:

సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పేజీలను నీటి అలలుగా పెయింటింగ్ చేశారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతిష్టాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కురికి సోమన పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని చేర్చారు.

తెలుగు మహాసభల లోగో విశేషాలు:

తెలుగు మహాసభల లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను పెయింటింగ్ చేశారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వ్యాక్యం కనిపిస్తుంది.

academy

telugu

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy