సాహో లుక్స్ : ప్రభాస్ యాక్షన్ మొదలైంది

SAHOOయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమాకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై సుజిత్‌  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ భారీ యాక్షన్‌ సీన్స్‌ ను షూట్ చేస్తుంది. ఈ షూటింగ్‌ కు సంబంధించిన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో బైక్‌ మీద కూర్చున్న స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy