సింగం, కట్టప్పలకు అరెస్ట్ వారెంట్

suryaత‌మిళ న‌టులు సూర్య‌, స‌త్య‌రాజ్‌ల‌తోపాటు మ‌రో ఆరుగురికి నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది తమిళనాడులోని ఊటీ కోర్టు. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వేసిన ప‌రువున‌ష్టం కేసుకు సంబంధించి రెండుసార్లు కోర్టుకు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఈ ఆదేశాలు జారీ చేశారు జ‌డ్జి సెంథిల్‌కుమార్. సూర్య‌, స‌త్య‌రాజ్‌ల‌తోపాటు మ‌రో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌, చ‌ర‌ణ్‌, విజ‌య్‌కుమార్‌, వివేక్‌, అరుణ్ విజ‌య్‌, సుప్రియ‌ల‌కు ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసు 2009కి సంబంధించింది. అప్ప‌ట్లో కొంత‌మంది త‌మిళ నటులు వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నార‌ని ఓ న‌టి ఆరోపించిన విష‌యం ఓ ప‌త్రిక ప్రచురించింది. దీనిపై సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిర‌స‌న రావ‌డంతో ఆ ప‌త్రిక క్ష‌మాప‌ణ కోరింది. అదే ఏడాది అక్టోబ‌ర్ 7న న‌దిగ‌ర్ సంఘం.. చేసిన ధ‌ర్నాలో ఈ న‌టులు జ‌ర్న‌లిస్టుల‌పై విమర్శలు చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రొజారియో మ‌రియా సుసాయ్ వీరిపై ఊటీ కోర్టులో కేసు పెట్టింది. ఈ కేసును డిస్మిస్ చేయాలని అప్ప‌ట్లోనే ఈ న‌టులంతా మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లినా.. కోర్టు నిరాక‌రించింది. రెండు రోజులుగా ఈ కేసుపై విచార‌ణ జ‌రిపింది ఊటీ కోర్టు. ఈ రెండు రోజుల్లో ఈ న‌టులు కోర్టుకు రాకపోవడంతో నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఊటీ న్యాయస్థానం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy